Telangana Institute Of Medical Sciences (TIMS) Vacancies 2026: తెలంగాణ రాష్ట్రంలో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) లో పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో 06-07-2026 తేదీలోపు అప్లై చేయాలి.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు క్రింది ఆర్టికల్ చివరి వరకు చదవండి.
TIMS లో ఖాళీలు భర్తీకి విడుదల చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్న నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) నుండి విడుదల అయ్యింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
NIMS నుండి విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా సనత్ నగర్ లో ఉన్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) లో ఖాళీగా ఉన్న టెక్నికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
భర్తీ చేస్తున్న టెక్నికల్ ఉద్యోగాలు :
బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ గ్రేడ్-2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ఎక్స్ రే లేదా C-arm టెక్నీషియన్ గ్రేడ్-2, CT టెక్నీషియన్ గ్రేడ్ -2, MRI టెక్నీషియన్, ECG టెక్నీషియన్, CSSD టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, ఆడియో మెట్రి టెక్నీషియన్, ఆడియో విజువల్ టెక్నీషియన్, EEG టెక్నీషియన్ గ్రేడ్-2, కేథలాబ్ టెక్నీషియన్, బయో మెడికల్ టెక్నీషియన్
భర్తీ చేస్తున్న అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు :
అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, మెడికల్ రికార్డు ఆఫీసర్ (జూనియర్), స్టాటస్టీషియన్, డిప్యూటీ రిజిస్ట్రార్ / డిప్యూటీ ఫైనాన్షియల్ కంట్రోలర్, సీనియర్ అసిస్టెంట్, అకౌంట్స్ ఆఫీసర్ / ఫైనాన్షియల్ కంట్రోలర్, అకౌంటెంట్, సూపర్వైజర్, హెల్త్ ఇన్స్పెక్టర్
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా 122 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
వయస్సు వివరాలు :
01-07-2026 తేదీ నాటికి టెక్నికల్ ఉద్యోగాలకు 35 సంవత్సరాలు లోపు వయస్సు ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలకు వయస్సు 45 సంవత్సరాలు లోపు వయస్సు ఉండాలి.
వయస్సులో సడలింపు వివరాలు :
- SC, ST, BC, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
- SC, ST అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 500/- రూపాయలు
- మిగతా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 1000/- రూపాయలు
అభ్యర్థులు ఎంపిక విధానం :
పోస్టులను అనుసరించి అప్లై చేసిన అభ్యర్థుల సంఖ్య ఆధారంగా పరీక్ష, ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ చివరి తేదీ :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి 06-07-2026 తేదీ నాటికి అప్లై చేయాలి.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
ది రిజిస్ట్రార్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్ – 500082
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి కొత్త ఉద్యోగాలు సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.
▶️ Download Notification – Click here
