అంగన్వాడీ కేంద్రాల్లో 15,982 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల

Telangana Anganwadi Teacher Notification 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Telangana Anganwadi Teacher & Anganwadi Helper Notification 2026: తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా 15,982 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఉద్యోగాలు భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల అవుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.

ఈ ఉద్యోగాలు భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు కూడా విడుదల అయ్యాయి. అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి

ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ప్రభుత్వ సంస్థ :

తెలంగాణ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ల ద్వారా తెలంగాణ అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

జిల్లాల వారీగా విడుదలవుతున్న ఈ నోటిఫికేషన్ ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 15,982 అంగన్వాడి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇందులో అంగన్వాడీ టీచర్ పోస్టులు 3,100 మరియు అంగన్వాడి హెల్పర్ పోస్ట్లు 12,882 పోస్టులు ఉన్నాయి.

అర్హతల వివరాలు :

  • ఈ ఉద్యోగాలకు స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు అర్హులు.
  • అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు అర్హులు.
  • అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు అప్లై చేయకపోతే పదో తరగతి పాసైన వారిని పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తారు..

ఎంపిక విధానం వివరాలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు నోటిఫికేషన్ లో తెలిపిన విధముగా వివిధ పారామీటర్లకు మార్కులు కేటాయిస్తారు. ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు.

అప్లికేషన్ తేదీలు :

జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అందులో అప్లికేషన్ తేదీలు ప్రకటిస్తారు.

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తమ జిల్లాలో విడుదల చేసిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. కొత్త నోటిఫికేషన్స్ సమాచారం కోసం ప్రతీ రోజూ మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.

Download All Notifications – Click here

▶️ Apply Online – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *