Telangana Jobs : తెలంగాణ రాష్ట్రంలో బస్తీ దవాఖానాల్లో మెడికల్ ఆఫిసర్ మరియు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సెప్టెంబర్ 10వ తేదీలోపు అప్లై చేయాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.
నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణలో ఖమ్మం జిల్లా DMHO నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
తాజాగా విడుదల చేయబడ్డ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఖమ్మంలో ఉన్న బస్తీ దవాఖానాల్లో మెడికల్ ఆఫీసర్ మరియు స్టాఫ్ నర్స్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ పోస్టులు మల్టీ జోన్ -1 కేడర్ పోస్టులు. స్టాఫ్ నర్స్ పోస్టులు జోన్-4 కేడర్ పోస్టులు.
మొత్తం ఖాళీల సంఖ్య :
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఆరు పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో మెడికల్ ఆఫీసర్ పోస్టులు మూడు, స్టాఫ్ నర్స్ పోస్టులు మూడు ఖాళీలు ఉన్నాయి.
అర్హతల వివరాలు :
స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు GNM / BSC నర్సింగ్ / MSC నర్సింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు MBBS పూర్తి చేసిన వారు అర్హులు.
జీతము వివరాలు :
మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 52,000/- రూపాయలు చొప్పున జీతం చెల్లిస్తారు. స్టాఫ్ నర్స్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 29,900/- రూపాయలు చొప్పున జీతం చెల్లిస్తారు.
వయసు వివరాలు :
18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు
వయసులో సడలింపు వివరాలు :
SC, ST, BC, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ విధానము :
అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానాల్లో అప్లై చేయాలి. ముందుగా వెబ్సైట్లో ఇచ్చిన ఆన్లైన్ అప్లికేషన్ లింకు ద్వారా గూగుల్ ఫారం నింపాలి. తర్వాత వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్ల పైన సెల్ఫ్ అటేస్టేషన్ చేసి అప్లికేషన్ కు జతపరిచి ఖమ్మం DMHO లో అందజేయాలి లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ పంపించవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులు 1000/- ఫీజును DMHO, ఖమ్మం పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీసి అప్లికేషన్ కు జతపరిచి అప్లై చేయాలి.
అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 3వ తేదీ నుండి సెప్టెంబర్ 10వ తేదీ లోప అప్లై చేయాలి.
అప్లికేషన్ అందజేయాల్సిన లేదా పంపించవలసిన చిరునామా :
అభ్యర్థులు క్రింద తెలిపిన అడ్రస్ లో స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయవచ్చు లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు.
District Medical & Health Office, F1, IDOC Complex, VV Palam, Khammam.
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
▶️ Download Notification – Click here
✅ Official Website – Click here
