Andhra Pradesh Staff Nurse, pharmacist, Multi Rehabilitation Worker Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది. వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ ఉద్యోగాలు భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 529 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఆర్టికల్ చివరిలో ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే ఆన్లైన్లో అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాలు సమాచారం కోసం మా వెబ్సైట్ ప్రతిరోజు ఓపెన్ చేయండి. మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో వెంటనే జాయిన్ అవ్వండి.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
Staff Nurse, pharmacist, Multi Rehabilitation Worker నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వ సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ (Staff Nurse) , ఫార్మసిస్ట్ (Pharmacist ) మరియు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ (Multi Rehabilitation Worker) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 529 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఇందులో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అత్యధికంగా 419 పోస్టులు ఉన్నాయి. ఫార్మసిస్ట్ పోస్టులు 24 మరియు మల్టీ రిహాబిలిటీషన్ వర్కర్ ఉద్యోగాలు 86 పోస్టులు ఉన్నాయి..
అర్హతల వివరాలు :
స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్ లేదా GNM కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు.
ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు డిప్లమో ఇన్ ఫార్మసీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులు.
మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ తో పాటు 18 నెలల మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికెట్ కోర్స్ పూర్తిచేసిన వారు అర్హులు.
అన్ని ఉద్యోగాలకు సంబంధిత కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఉండాలి.
జీతము వివరాలు :
స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 27,675/- రూపాయలు జీతం ఇస్తారు.
ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి ఎంపికైన వారికి నెలకు 23,393/- రూపాయలు జీతం ఇస్తారు.
మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ ఉద్యోగాలకి ఎంపికైన వారికి నెలకు 23,494/- రూపాయలు జీతం ఇస్తారు.
వయస్సు వివరాలు :
01-01-2026 నాటికి వయస్సు 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
SC, ST, BC , EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు ఇస్తారు.
PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు ఇస్తారు.
ఎంపిక విధానం వివరాలు :
రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
OC అభ్యర్థులకు ఫీజు – 1200/- రూపాయలు
SC, ST, BC, PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 900/- రూపాయలు
అప్లికేషన్ విధానం :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో apmsrb వెబ్సైట్ లో అప్లై చేయాలి.
అప్లికేషన్ తేదీలు :
జూన్ 13వ తేదీ నుండి జూన్ 30వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేయాలి.
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేయండి.
▶️ Download Notification – Click here
