ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Andhra University Walk-in Interview
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Andhra University Health centre Walk-in Interview : ఆంధ్ర యూనివర్సిటీ హెల్త్ సెంటర్ నుండి మెడికల్ ఆఫీసర్, హోమియో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ మరియు స్టేచర్ బాయ్ పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ ఉద్యోగాలను తాత్కాలిక పద్ధతిలో 11 నెలల కాలానికి భర్తీ చేస్తున్నారు. అభ్యర్థుల పనితీరు మరియు అవసరం ఆధారంగా కొనసాగిస్తారు. ఇలాంటి కొత్త నోటిఫికేషన్స్ సమాచారం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతీ రోజు ఓపెన్ చేయండి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ నుండి విడుదల అయ్యింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్, హోమియో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ మరియు స్టేచర్ బాయ్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీలు :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హతల వివరాలు :

పోస్టులను అనుసరించి SSC, GNM , B.Sc నర్సింగ్, D.Pharmacy, B.Pharmacy, MBBS, BHMS వంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

జీతము వివరాలు :

మెడికల్ ఆఫీసర్ మరియు హోమియో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపీకైనా అభ్యర్థులకు నెలకు 40,000/- జీతము ఇస్తారు.

స్టాఫ్ నర్స్ మరియు ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000/- జీతం ఇస్తారు.

స్ట్రెచర్ బాయ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 12,000/- జీతం ఇస్తారు.

ఎంపిక విధానం వివరాలు :

అర్హులైన అభ్యర్థులను వాక్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ నిర్వహించే తేదీలు :

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత అభ్యర్థులు 19-06-2026 తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు..

ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం :

ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

ఈ ఉద్యోగాల వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని అనుకునే అభ్యర్థులు క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ తో హాజరు కావాలి.

  1. నింపిన అప్లికేషన్ ఫారం
  2. ఒరిజినల్ సర్టిఫికెట్స్
  3. ఒక సెట్ self Attested Xerox కాపీస్
  4. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్
  5. ఆధార్ కార్డు
  6. రెండు తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు

▶️ Download Notification & Application – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *