ఆంధ్రప్రదేశ్ లో 345 అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల

Anganwadi Jobs Recruitment 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Anganwadi Jobs Recruitment in AP : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు శుభవార్త. పదో తరగతి అర్హతతో అంగన్వాడీఉద్యోగాలు భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. తాజాగా రెండు నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పదో తరగతి అర్హత ఉన్న వారు అప్లై చేయవచ్చు.

ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయవచ్చు. ఈ రెండు నోటిఫికేషన్స్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంస్థ :

ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిని కార్యాలయాలు నుండి ఈ రెండు నోటిఫికేషన్స్ విడుదల చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా మరియు పోలవరం జిల్లాల్లో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

రెండు నోటిఫికేషన్స్ ద్వారా మొత్తం 345 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో శ్రీ సత్య సాయి జిల్లాలో 129 పోస్టులు, పోలవరం జిల్లాలో 216 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హత వివరాలు :

ఖాళీలు ఉన్న ప్రాంతంలో స్థానికంగా నివసిస్తున్న పదో తరగతి పాస్ అయిన వివాహిత మహిళలు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

SC, ST హాబిటేషన్స్ లో కేటాయించిన ఉద్యోగాలకు SC, ST అభ్యర్థులు మాత్రమే అప్లై చేయుటకు అర్హులు

వయోపరిమితి వివరాలు :

వయస్సు 18 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

ఎంపిక విధానం వివరాలు :

అర్హులైన అభ్యర్థులను 10వ తరగతిలో వచ్చిన మార్కులు, అనుభవం ఇంటర్వ్యూ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వంటి వాటి ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ విధానం :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అప్లికేషన్ అందచేసి అప్లై చేయవచ్చు. అప్లై చేసే సమయంలో అభ్యర్థులు అప్లికేషన్ కు అవసరమైన అన్ని సర్టిఫికెట్ల పైన గజిటెడ్ అధికారి చేత అటేస్టేషన్ చేయించి అప్లికేషన్ కి జతపరిచి అప్లై చేయాలి.

అప్లికేషన్ చివరి తేదీలు :

శ్రీ సత్య సాయి జిల్లాలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ : 17-07-2026

పోలవరం జిల్లాలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ : 20-07-2026

🔥 అర్హులైన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి కొత్త నోటిఫికేషన్స్ సమాచారం కోసం ప్రతీ రోజూ మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.

▶️ Download Notification – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *