AP PHC Jobs Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను జూన్ 30వ తేదీలోపు అప్లై చేయాలి.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విశాఖపట్నంలో ఉన్న జిల్లా, వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి విడుదల అయ్యింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, FNO, శానిటరీ అటెండర్ కం వాచ్మెన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
నోటిఫికేషన్ ద్వారా 03 ల్యాబ్ టెక్నీషియన్, 04 FNO, 11 శానిటరీ అటెండర్ కం వాచ్మెన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
- ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు DMLT / BSc MLT పూర్తి చేసిన వారు అర్హులు
- FNO ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కోర్స్ కలిగి ఉండాలి.
- శానిటరీ అటెండర్ కం వాచ్మెన్ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయిన వారు అర్హులు.
వయస్సు వివరాలు :
- 01-01-2026 తేది నాటికి 18 నుండి 42 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
వయస్సులో సడలింపు వివరాలు :
- SC, ST, BC, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు ఇస్తారు.
- PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ తేదీలు :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జూన్ 20వ తేదీ నుండి జూన్ 30వ తేదీలోపు అప్లై చేయాలి.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
- OC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 200/- రూపాయలు
- SC, ST, BC, EWS , PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 100/- రూపాయలు
ఎంపీక విధానం వివరాలు :
అర్హులైన అభ్యర్థులను రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
District Medical and Health Office, Visakhapatnam
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
▶️ Download Notification – Click here
✅ Official Website – Click here
