ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP DSH Recruitment 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP DSH Notification 2026 : ఆంధ్రప్రదేశ్ లో వైద్య, ఆరోగ్య శాఖ కు చెందిన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ లో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను జూన్ 30వ తేదీలోపు అప్లై చేయాలి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి..

AP DSH లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, కాకినాడ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా GDA / MNO / FNO, ల్యాబ్ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్ మరియు పోస్టుమార్టం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

అర్హతల వివరాలు :

పోస్టులను అనుసరించి 10th / SSC, DMLT / BSC (MLT), CRA / DMIT వంటి అర్హతలు వారు అర్హులు.

జీతము వివరాలు :

  • ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు నెలకు 32,670/- జీతము ఇస్తారు.
  • డార్క్ రూమ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 28,220/- జీతము ఇస్తారు.
  • జనరల్ డ్యూటీ అటెండెంట్ / MNO / FNO, పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15,000/- జీతము ఇస్తారు.

వయస్సు వివరాలు :

  • 42 సంవత్సరాలు లోపు వయస్సు ఉండాలి.
  • SC, ST, BC, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
  • PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

  • OC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 350/- రూపాయలు
  • SC / ST / BC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 250/- రూపాయలు
  • PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక విధానం వివరాలు :

ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాల ఎంపిక విధానంలో ఎలాంటి రాత పరీక్ష లేదు. కేవలం మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ తేదీలు :

అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను 18-06-2026 తేదీ నుండి 30-06-2026 తేదీలోపు అప్లై చేయాలి.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

O/o DCHS, Kakinada District, in the campus of 3rd Floor of DM&HO Office, Kakinada

▶️ Download Notification & Application – Click here

Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *