Andhrapradesh Collector Office Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీన నుండి మే 6వ తేదీలోపు అప్లై చేయాలి.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ప్రస్తుతము ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ కార్యాలయం నుండి విడుదల చేశారు.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ మరియు ఈ-డివిజనల్ మేనేజర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
దరఖాస్తుదారు తప్పనిసరిగా B.Tech/B.E/ BCA / B.Sc(కంప్యూటర్స్)లో బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత రంగంలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి, అలాగే ఆంగ్లంలో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.అన్ని విద్యా ధృవపత్రాలు నకలు పైన గెజిటెడ్ అధికారి చేత అట్టెస్టేషన్ చేయించాలి.
వయస్సు వివరాలు :
31-03-2026 తేదీ నాటికి వయస్సు 21 నుండి 35 సంవత్సరాలు మధ్య ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు
అఅప్లికేషన్ ఫీజు వివరాలు :
అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం వివరాలు :
అభ్యర్థులను రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ తేదీలు :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 6వ తేదీలోపు అప్లై చేయండి.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు క్రింద ఇచ్చిన అడ్రస్ లో అప్లికేషన్ అందజేయాలి.
అడ్రస్ : The Administrative Officer, O/o the District Collector, Tirupati
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసేముందు పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేయండి..
