సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ సంస్థ నుండి వివిధ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 ఇండియన్ నేవీలో ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: నాన్ టీచింగ్ ఉద్యోగాల
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మెడికల్ ఆఫీసర్ ( ఫిమేల్ ) -1
- ప్రైవేట్ సెక్రటరీ -4
- సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ -2
- టెక్నికల్ అసిస్టెంట్ -3
- సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ – 1
- లేబరేటరి అసిస్టెంట్ – 2
- LDC ( Hindi typist)- 1
- లాబొరెటరీ అటెండెంట్ -2
🔥 విద్యార్హత :
- లాబొరెటరీ అటెండెంట్ : సైన్స్ స్ట్రీమ్ లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- LDC ( హిందీ టైపిస్ట్ ): కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి వుండాలి మరియు హిందీ టైపింగు సామర్థ్యం నిముషానికి 30 పదాలు వచ్చి వుండాలి.
- లేబరేటరి అసిస్టెంట్ ( ఇంజనీరింగ్ టెక్నాలజీ & ఎర్త్ సైన్సెస్ ) :
- ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగానికి సంబంధించి ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు
- ఎర్త్ సైన్సెస్ విభాగానికి సంబంధించి కంప్యూటర్ సైన్సు , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , కంప్యూటర్ అప్లికేషన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు
- సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ :కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా లైబ్రరీ సైన్స్ లలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
- టెక్నికల్ అసిస్టెంట్ ( ఇన్స్ట్రుమెంటేషన్ / ఎర్త్ సైన్సెస్ / కెమికల్ సైన్సెస్ ) : సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.& 2 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి.
- సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ( ఇంజనీరింగ్ టెక్నాలజీ & ఎర్త్ సైన్సెస్ ) : సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ తో పాటు 3 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి.
- ప్రైవేట్ సెక్రటరీ : బ్యాచిలర్ డిగ్రీ తో పాటు 3 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి మరియు స్టెనోగ్రఫీ , టైపింగ్ , కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి వుండాలి.
- మెడికల్ ఆఫీసర్ ( ఫిమేల్ ) : ఎంసీఐ ద్వారా గుర్తింపు పొందిన ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- మెడికల్ ఆఫీసర్ ( ఫిమేల్ ) పోస్ట్ కి 40 సంవత్సరాలు
- ప్రైవేట్ సెక్రటరీ , సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్‌లకు 35 సంవత్సరాలు
- టెక్నికల్ అసిస్టెంట్ సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్ట్ లకి 32 సంవత్సరాలు
- లేబరేటరి అసిస్టెంట్ , LDC ( Hindi typist) , లాబొరెటరీ అటెండెంట్ పోస్ట్ కి 30 సంవత్సరాలు లోపు గా వున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ ఎస్టీ , ఓబీసీ ( NCL) , దివ్యాంగులు , Ex – సర్విస్ మాన్ వారికి యు జి సి వారి నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకుని , ఆ దరఖాస్తు ఫారం యొక్క కాపీ ను ఆఫీస్ వారి చిరునామా కు చేర్చాలి.
🔥 దరఖాస్తు చేర్చవలసిన చిరునామా :
- ఎన్వలప్ పైన Application For The Post Of ________ ప్రస్తావించాలి.
Registrar (Recruitment Cell),
Central University of Rajasthan,
NH-8, Bandarsindri, Kishangarh,
District – Ajmer, 305817 (Rajasthan)
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ & EWS & ఓబీసీ అభ్యర్థులు 1500/- రూపాయలు
- ఎస్సీ , ఎస్టీ , PwBD అభ్యర్థులు 750/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
🔥 జీతం :
- అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ల ఆధారంగా జీతం లభిస్తుంది.
- మెడికల్ ఆఫీసర్ ( ఫిమేల్ ) వారికి పే లెవెల్ – 10
- ప్రైవేట్ సెక్రటరీ వారికి పే లెవెల్ -7
- సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వారికి పే లెవెల్ -6
- టెక్నికల్ అసిస్టెంట్ , సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ వారికి పె లెవెల్ – 6
- లేబరేటరి అసిస్టెంట్ వారికి పే లెవెల్ -4
- LDC ( Hindi typist) వారికి పే లెవెల్ -2
- లాబొరెటరీ అటెండెంట్ వారికి పే లెవెల్ – 1 ప్రకారం జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 16/12/2024
- దరఖాస్తు చేసిన తర్వాత హార్డకాపీ పంపడానికి చివరి తేది : 20/12/2024 ( సాయంత్రం 5:00 గంటల లోగా)
👉 Click here for official webiste