మన రాష్ట్రంలో ఏకలవ్య మోడల్ స్కూల్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | EMRS Recruitment 2024 | Latest Jobs Notifications

అల్లూరి జిల్లా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) – పాడేరు నందు గల 11 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 2024-25 విద్యా సంవత్సరంలో CBSE సిలబస్ ను బోదించేందుకు గాను అతిథి ఉపాద్యాయులు భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థులు నుండి , కేంద్రీయ విద్యాలయాల సంస్థలు , స్టేట్ గవర్నమెంట్ సంస్థల నుండి రిటైర్ అయిన ఉపాద్యాయుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 ఎరువులు తయారీ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 రాత పరీక్ష లేకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :  ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) – పాడేరు.

🔥 పాడేరు ఐటీడీఏ పరిధి లో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ :

  1. అనంతగిరి
  2. అరకువెలి
  3. డుంబ్రిగుడ
  4. హుకుంపేట
  5. పాడేరు
  6. పెద్దబయలు
  7. ముంచంగిపుట్
  8. జి.మాడుగుల
  9. చింతపల్లి
  10. GK వీధి 
  11. కొయ్యూరు

🔥 భర్తీ చేయు ఉద్యోగాల సంఖ్య : 21

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్:
  1. PGT ఇంగ్లీష్ – 01
  2. PGT తెలుగు – 01 
  3. PGT కెమిస్ట్రీ – 01
  4. PGT బయోలజీ – 08

       2) ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ :

      a) TGT తెలుగు – 10

                  b) TGT హిందీ – 02

🔥 విద్యార్హతలు : 

1) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్: 

  • కనీసం 50 శాతం మార్కులతో , NCERT ఎడ్యుకేషన్ లో రీజినల్ కాలేజీ ద్వారా  సంబంధిత సబ్జెక్టు లలో  2 సంవత్సరాల పీజీ కోర్సు 

                   లేదా 

  • సంబంధిత సబ్జెక్టుల్లో గుర్తింపు పొందిన సంస్థ నుండి  కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ 
  • గుర్తింపు పొందిన సంస్థ నుండి B.ED లేదా తత్సమాన అర్హత
  • CBSE నిర్వహించిన CTET పేపర్ -2 లేదా స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ లో ఉత్తీర్ణత
  • ఇంగ్లీషు మరియు హిందీ మీడియం లో బోదించగలిగే నైపుణ్యం.

PGT ఇంగ్లీష్ వారు ఇంగ్లీష్ లిటరేచర్ & PGT తెలుగు వారు తెలుగు లిటరేచర్ , PGT కెమిస్ట్రీ వారు కెమిస్ట్రీ లేదా బయో కెమిస్ట్రీ లో పీజీ పూర్తి చేసి వుండాలి.

2) ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ : 

  • కనీసం 50 శాతం మార్కులతో , NCERT ఎడ్యుకేషన్ లో రీజినల్ కాలేజీ ద్వారా  సంబంధిత సబ్జెక్టు లలో  4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు 

                   లేదా 

  • సంబంధిత సబ్జెక్టుల్లో గుర్తింపు పొందిన సంస్థ నుండి  కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ 
  • గుర్తింపు పొందిన సంస్థ నుండి B.ED లేదా తత్సమాన అర్హత
  • CBSE నిర్వహించిన CTET పేపర్ -2 లేదా స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ లో ఉత్తీర్ణత
  • TGT తెలుగు వారు వారి డిగ్రీ లో తెలుగు సబ్జెక్టు గా కలిగి వుండాలి 
  • TGT హిందీ వారు వారి డిగ్రీ లో హిందీ సబ్జెక్టు గా కలిగి వుండాలి 

🔥దరఖాస్తు విధానం : 

  • అభ్యర్థులు తేది : 18/10/2024 నుండి 26/10/2024 సాయంత్రం 5:00 గంటల లోగా 
  • గురుకులం సెల్ , ఐటీడీఏ పాడేరు , అల్లూరి సీతారామరాజు జిల్లా వారికి అందజేయాలి లేదా [email protected] కి మెయిల్ ద్వారా పంపాలి. 

🔥 ముఖ్యమైన తేదీలు :

  • పూర్తి చేసిన అప్లికేషన్ ను సంస్థ కు చెరవేయుటకు ప్రారంభ తేది : 18/10/2024
  • పూర్తి చేసిన అప్లికేషన్ ను సంస్థ కు చెరవేయుటకు చివరి తేది : 26/10/2024 సాయంత్రం 5:00 గంటల వరకు.

🔥 నోట్:  మరిన్ని వివరాలకు 9493758072 , 9493845498 ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!