Headlines

రైల్వేలో ఇంటర్ అర్హతతో 3,445 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Raiway NTPC (Under Graduate) Notification 2024 | RRB NTPC (Under graduate) Notification in Telugu

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : రైల్వేలో ఉద్యోగాలు భర్తీకి మరొక బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే శాఖలో ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమో పూర్తి చేసిన వారు అప్లై చేసుకునే విధంగా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (అండర్ గ్రాడ్యుయేట్స్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ అధికారికంగా పూర్తి నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో 3,445 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత గల భారతీయ పురుష మరియు మహిళ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సెప్టెంబర్ 21వ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు , ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానము , జీతము , అప్లికేషన్ విధానము,  జోన్ల వారీగా ఖాళీలు ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి. ఉద్యోగాలకు అప్లై చేసే ప్రతి ఒక్కరూ ఈ ఆర్టికల్ చివరిలో ఇచ్చిన పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹 నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్

భర్తీ చేస్తున్న పోస్టులు : నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీస్ (అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్) ఉద్యోగాలు అయిన కమర్షియల్ కం టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ కం టైపిస్ట్, జూనియర్ క్లర్క్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥  మొత్తం పోస్టుల సంఖ్య : 3445

పోస్టుల వారీగా ఖాళీల సంఖ్య క్రింది విధంగా ఉంది.

  • కమర్షియల్ కం టికెట్ క్లర్క్ – 2022
  • అకౌంట్ క్లర్క్ కం టైపిస్ట్ – 361
  • జూనియర్ క్లర్క్ టైపిస్ట్ – 990
  • ట్రైన్స్ క్లర్క్ – 72

🔥 అర్హత : 12వ తరగతి ( ఇంటర్ లేదా ఐటిఐ లేదా డిప్లొమా )

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి

🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ : 21-09-2024

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 21-09-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 20-10-2024

🔥 అప్లికేషన్ లో మార్పులు చేసుకునేందుకు తేదీలు : అక్టోబర్ 23 నుంచి నవంబర్ 11వ తేదీ మధ్య అప్లికేషన్ లో కొన్ని మార్పులు చేసుకునే అవకాశం ఇస్తారు.

🔥 పరీక్ష తేదీ : త్వరలో వెల్లడిస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు.

🔥 వయస్సు సడలింపు :  భారత ప్రభుత్వ నిబంధనల మేరకు క్రింది తెలిపిన విధంగా వయో సడలింపు కలదు. అనగా క్రింది విధంగా వయో సడలింపు ఉంటుంది. 👇 👇 👇 

  • ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు కలదు.
  • ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు కలదు.
  • PwBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : CBT -1 , CBT -2 , డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

  • అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్ మరియు జూనియర్ క్లాక్ కం టైపిస్ట్ ఉద్యోగాలకు టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది.

జీతము : పోస్టుల వారీగా ఈ ఉద్యోగాలకు జీతము క్రింది విధంగా ఉంటుంది. 

  • కమర్షియల్ కం టికెట్ క్లర్క్ ఉద్యోగాలకు 21,700/- తో జీతము ప్రారంభమవుతుంది.
  • అకౌంట్ క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగాలకు 19,900/- తో జీతం ప్రారంభమవుతుంది.
  • జూనియర్ క్లర్క్ టైపిస్ట్ ఉద్యోగాలకు 19,900/- తో జీతం ప్రారంభమవుతుంది.
  • ట్రైన్స్ క్లర్క్ ఉద్యోగాలకు 19,900/- తో జీతం ప్రారంభమవుతుంది.

✅ ఫీజు :

  • SC, ST , ఈబీసీ , ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులుకు – 250/-
  • మిగతా అభ్యర్థులకు 500/- రూపాయలు
  • పరీక్ష రాసిన అభ్యర్థులకు బ్యాంకు చార్జీలు మినహాయించి ఫీజు రిఫండ్ కూడా చేయడం జరుగుతుంది.
  • SC, ST , ఈబీసీ , ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులుకు పూర్తి ఫీజు రిఫండ్ చేస్తారు. 
  • మిగతా వారికి 400/- రిఫండ్ చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!