10th అర్హత గల నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది .
10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది .
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1558 పోస్టులు భర్తీ చేస్తున్నారు .
ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవల్దార్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో కోరుతున్నారు .
పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని అప్డేట్ చేయబడిన ఖాళీలు సమాచారం అధికారికి వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .
ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు . ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషలతో పాటు కొన్ని స్థానిక భాషలలో కూడా నిర్వహిస్తున్నారు . కాబట్టి తెలుగులో కూడా పరీక్ష రాసుకునే అవకాశం ఉంది .
ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు జూలై 21వ తేదీ లోపు అప్లై చేయాలి .
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 1558
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – పర్మినెంట్ ఉద్యోగాలు
🔥 అర్హతలు : 10th పాస్
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 30-06-2023
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 21-07-2023
✅ పరీక్ష తేదీ : సెప్టెంబర్ 2023 లో నిర్వహిస్తారు
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 27 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు :
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .
🔥 పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి . అవి చీరాల , గుంటూరు , కాకినాడ కర్నూలు , విజయవాడ , విజయనగరం ,విశాఖపట్నం , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి హైదరాబాద్ , వరంగల్ , కరీంనగర్
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు శారీరక దారుఢ్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు . మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష మాత్రమే ఉంటుంది . హవల్దార్ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటుగా శారీరిక దారుఢ్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు .
🔥 పరీక్ష విధానం : పరీక్షలు సెషన్-1 మరియు సెషన్- 2 అని రెండు ఉంటాయి .
సెషన్ -1 లో మొత్తం 40 ప్రశ్నలు ఇస్తారు , 120 మార్కులకు ఉంటుంది . 45 నిమిషాల సమయం ఇస్తారు .
సెషన్ -2 లో మొత్తం 50 ప్రశ్నలు ఇస్తారు , 150 మార్కులకు ఉంటుంది . 45 నిమిషాల సమయం ఇస్తారు.
రెండు సెషన్ లో కూడా ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు ఉంటాయి. సెషన్-1 లో నిర్వహించే పరీక్షలో ఎటువంటి నెగటివ్ మార్కులు లేవు .
రెండవ సెషన్ లో నిర్వహించే పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గించడం జరుగుతుంది .
రెండు సెషన్లు కూడా ఒకేరోజు నిర్వహిస్తారు .
🔥 ఫీజు : 100/- ( మహిళలు ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు వికలాంగ అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు నుండి మినహాయింపు కలదు )
🔥 అప్లికేషన్ విధానం : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారికి వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేయాలి
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here