Headlines

IOCL లో 400 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IOCL Latest jobs Recruitment 2024 | Latest Government Jobs Notifications in Telugu 

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి 400 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది..

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న వివిధ రకాల ఉద్యోగాలకు అర్హత గలవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రిఫైనరీలలో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు.

ఈ ఉద్యోగాలు ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే పరీక్ష మన తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి నిర్వహిస్తారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేయండి. 

పూర్తి నోటిఫికేషన్ వివరాలు మరియు అప్లికేషన్ లింక్ క్రింది ఇవ్వబడినవి…

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఎనలిస్ట్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 400

🔥 విద్యార్హత : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఈ సంబంధిత పోస్టులను అనుసరించి డిప్లమా, డిగ్రీ, ఐటిఐ వంటి అర్హతలు కలిగి ఉండాలి.

🔥 వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి వయస్సు 18 సంవత్సరాలు ఉండి గరిష్ట వయస్సు 26 సంవత్సరాలు లోపు ఉండాలి. (31-07-2024 నాటికి)

Note : ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. అనగా 

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 జీతము : పే స్కేల్ 25,000/- నుండి 1,05,000/- 

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ తేది : 22-07-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 21-08-2024

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్షా కేంద్రాలు : దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం మరియు హైదరాబాద్ పట్టణాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.

🔥 జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న రిఫైనరీలలో పోస్టింగ్ ఇస్తారు. 

🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

🔥 క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!