Headlines

పదో తరగతి అర్హతతో 8,326 ఉద్యోగాలు | SSC MTS Notification 2024 in Telugu | Staff Selection Commission MTS Notification 2024 | SSC MTS Age, Syllabus, Selection Process,Apply Process 

10వ తరగతి అర్హత గల నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

పదో తరగతి అర్హతతో వివిధ ప్రభుత్వ శాఖలలో 8,326 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

👉 ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు. 

ప్రస్తుతం SSC విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా MTS మరియు Havaldar పోస్టులు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న పోస్టుల్లో MTS పోస్టులు 4887 ఉండగా Havaldar పోస్టులు 3439 ఉన్నాయి.

పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని అప్డేట్ చేయబడిన ఖాళీలు సమాచారం అధికారిక వెబ్సైట్ లో పొందుపరచడం జరుగుతుందని నోటిఫికేషన్ లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తెలుగు, ఇంగ్లీష్, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహిస్తారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

SSC MTS పోస్టులకు ప్రిపేర్ అయ్యే వారి కోసం మన APP లో కేవలం 499/- పూర్తి కోర్సు ( సిలబస్ ప్రకారం అత్యుత్తమ ఫ్యాకల్టీతో ఈ క్లాసులు చెప్పించడం జరిగింది.) 

DEMO Classes చూసి నచ్చితేనే మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 8,326 పోస్టులు 

🔥 అర్హతలు : 10th pass

🔥 జీతం : 

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 27-06-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 31-07-2024

✅ పరీక్ష తేదీ : అక్టోబర్ నుండి నవంబర్ (2024) మధ్య నిర్వహిస్తారు.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు (01-08-2024 నాటికి) 

🔥 గరిష్ట వయస్సు : 

  • MTS పోస్టులకు గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ( 01-08-2024 నాటికి ) 
  • Havaldar పోస్టులకు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు ( 01-08-2024 నాటికి )

🔥 వయస్సు సడలింపు : 

  1. ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  2. ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
  3. PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి . అవి చీరాల , గుంటూరు , కాకినాడ , కర్నూలు , విజయవాడ , విజయనగరం ,విశాఖపట్నం , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి హైదరాబాద్ , వరంగల్ , కరీంనగర్

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :

  • MTS పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష లో వచ్చిన మార్కులు ఆధారముగా ఎంపిక చేస్తారు
  • Havaldar పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష , Physical Efficiency Test (PET) , Physical Standard Test (PST) , మెడికల్ టెస్ట్ లు నిర్వహించి వెరిఫికేషన్ చేస్తారు.

🔥 పరీక్ష విధానం : 

  • సెషన్-1 లో 40 ప్రశ్నలు 120 మార్కులకు ఇస్తారు. సమయం 45 నిమిషాలు ఇస్తారు. 
  • సెషన్-2 లో 50 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు. సమయం 45 నిమిషాలు ఇస్తారు.

🔥 ఫీజు : 100/- 

  • మహిళలు, ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు,PwBD అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు నుండి మినహాయింపు కలదు.

🔥 అప్లికేషన్ విధానం : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేయాలి. 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది, కాబట్టి ఆ వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేయండి.

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!