APTRANSCO AEE Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం చాలా సంవత్సరాలు తర్వాత నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టులు భర్తీ చేస్తున్నారు. APGENCO, APTRANSCO, APSPDCL, APEPDCL, APCPDCL లలో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
మొత్తం 630 ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
AEE పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థలు :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ APGENCO, APTRANSCO, APSPDCL, APEPDCL, APCPDCL సంస్థలు నుండి విడుదల అయ్యాయి..
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
APGENCO, APTRANSCO, APSPDCL, APEPDCL, APCPDCL సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
- 5 నోటిఫికేషన్స్ ద్వారా మొత్తం 630 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- APGENCO లో 100 పోస్టులు, APTRANSCO లో 200 పోస్టులు, APSPDCL లో 135 పోస్టులు, APEPDCL లో 135 పోస్టులు, APCPDCL లో 60 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతల వివరాలు:
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిగ్రీ (లేదా) టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ డిగ్రీ (లేదా) సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
వయస్సు వివరాలు :
42 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
వయస్సులో సడలింపు వివరాలు :
SC, ST, BC, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు 1000/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఎంపీక విధానం వివరాలు :
అర్హులైన అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ తేదీలు :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జూన్ 30వ తేదీ నుండి జూలై 20వ తేదీలోపు అప్లై చేయండి.
▶️ అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
🔥 Download All Notifications – Click here
