రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | 2026 లో రైల్వేలో ఉద్యోగాలకు మొదటి నోటిఫికేషన్ విడుదల

RRB ALP Notification 2026 full Details
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Railway ALP Notification 2026 Vacancies : భారతీయ రైల్వేలో ఉద్యోగాలు భర్తీకి బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.. 2026 లో రైల్వేలో ఉద్యోగాలు భర్తీకి ఈ మొదటి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హులైన్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. మీరు రైల్వే ALP ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ కావాలి అంటే ప్లే స్టోర్ నుండి “INB Jobs” App డౌన్లోడ్ చేసుకోండి.

▶️ Download INB jobs App – Click here

RRB ALP నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి విడుదల అయ్యింది.

ALP నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న మొత్తం ఖాళీలు :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,127 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

RRB ALP ఉద్యోగాల అర్హతల వివరాలు :

రైల్వేలో ALP ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో పాటు ఐటిఐ, డిప్లొమా అర్హతలు ఉన్నవారు అర్హులు . ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

RRB ALP వయస్సు వివరాలు :

రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఉద్యోగాలకు వయస్సు 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలు మధ్య ఉన్న వారు అర్హులు.

SC, ST అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

OBC అభ్యర్థులకు వయస్సులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.

PwBD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

రైల్వే ALP అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు :

నోటిఫికేషన్ ద్వారా భర్తీ అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు 15-05-2026 తేదీ నుండి 14-06-2026 తేదీలోపు అప్లై చేయాలి.

RRB ALP అప్లికేషన్ ఫీజు వివరాలు :

జనరల్ / ఓబీసీ / EWS అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

SC / ST / Women / PwBD అభ్యర్థులు 250/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Railway ALP ఉద్యోగాలకు ఎంపిక విధానం వివరాలు :

అర్హత ఉన్న అభ్యర్థులను CBT 1, CBT 2, CBAT, Document Verification, Medical Examination నిర్వహించి ఎంపిక చేస్తారు.

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు Indicative Notification విడుదల అయ్యింది. క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి కొత్త నోటిఫికేషన్స్ సమాచారం కోసం ప్రతీ రోజూ మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.

Download Notification – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *