విశాఖపట్నం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Visakhapatnam HPCL Notification 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

HPCL Graduate Apprentice Trainee Notification 2026 : కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి 250 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 10వ తేదీలోపు అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు అన్ని తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

ఇలాంటి వివిధ రకాల విద్యా, ఉద్యోగాల సమాచారం కోసం ప్రతీ రోజూ మా వెబ్సైట్ www.inbjobs.com అనే వెబ్సైట్ ప్రతీ రోజూ ఓపెన్ చేయండి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ను హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) నుండి విడుదల అయ్యింది.

భర్తీ చేస్తున్న పోస్టులు :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ నోటిఫికేషన్ ద్వారా 250 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో మహారాష్ట్రలో ఉన్న ముంబై రిఫైనరీలో 120 పోస్టులు , ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విశాఖ రిఫైనరీలో 130 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హతలు వివరాలు :

కెమికల్ / సివిల్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఇన్స్ట్రుమెంటేషన్ / కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు.

అప్లికేషన్ తేదీలు :

అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు 25-02-2026 తేదీ నుండి 10-03-2026 తేదీలోపు అప్లై చేయాలి.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

స్టైఫండ్ వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25,000/- రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. ఇందులో HPCL సంస్థ వారు 20,500/- రూపాయలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి 4,500/- రూపాయలు ఇస్తారు.

వయస్సు వివరాలు :

10-03-2026 తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నుండి 25 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. SC, ST అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది. OBC అభ్యర్థులకు వయస్సులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది. PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

Download Full Notification – Click here

Rigistration Link – Click here

Apply Link – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *