జాతీయ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | CNCI Staff Nurse Notification 2026

CNCI Staff Nurse Notification 2026 Apply Process
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

CNCI Staff Nurse Jobs Recruitment 2026 : కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన అటానమస్ సంస్థ అయిన చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (CNCI) నుండి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో గూగుల్ ఫారం నింపాలి మరియు అప్లికేషన్ మెయిల్ ద్వారా కూడా పంపించాలి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క వివరాలను తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వ సంస్థ :

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అటానమస్ ఇన్స్టిట్యూట్ అయిన చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (CNCI) నుండి విడుదలైంది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

తాజాగా విడుదల చేయబడ్డ ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు.

అర్హతల వివరాలు :

జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ ప్లస్ డిప్లొమా ఆంకాలజీ నర్సింగ్ (లేదా) బేసిక్ లేదా పోస్ట్-బేసిక్ బీఎస్సీ (నర్సింగ్) (లేదా) జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీతో పాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. మరియు అభ్యర్థులు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ / స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో నమోదు చేసుకోవాలి.

వయస్సు వివరాలు :

అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలలోపు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

జీతం వివరాలు :

ఎంపికైన వారికి నెలకు 30 వేల రూపాయలు జీతం ఇస్తారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అప్లికేషన్ తేదీలు :

ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి రెండవ తేదీలోపు అర్హులైన అభ్యర్థులు అప్లై చేయాలి.

ఎంపిక విధానం వివరాలు :

అభ్యర్థులు అప్లై చేసిన తర్వాత అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి తదుపరి ఎంపిక ప్రక్రియకు పిలుస్తారు. రిక్రూట్మెంట్ కి సంబంధించిన మిగతా అప్డేట్స్ కోసం అభ్యర్థులు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు www.cnci.ac.in వెబ్సైట్ ఓపెన్ చేయండి.

అప్లై విధానం వివరాలు :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి క్రింది ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి గూగుల్ ఫారం నింపండి. మరియు నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసి నింపిన తర్వాత దాన్ని మెయిల్ ద్వారా పంపించాలి.

Apply Link – Click here

అప్లికేషన్ పంపించాల్సిన మెయిల్ ఐడి : recruitment.cncik@gmail.com

Download Notification & Application – Click here

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు తెలుసుకునేందుకు మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతిరోజు ఓపెన్ చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *