RBI Assistant Jobs Apply Online : దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. హైదరాబాద్ లో ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో కూడా ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
పరీక్షను తెలుగు భాషలో కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాలు సమాచారం మీరు ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ? అయితే మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతీ రోజూ ఓపెన్ చేయండి.
Table of Contents :
RBI Assistant నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ప్రస్తుతం మీరు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ బ్యాంకులకే బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదలైంది.
RBI Assistant నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం నుండి విడుదల చేయడం జరిగింది.
RBI Assistant మొత్తం ఖాళీల సంఖ్య :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 650 అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
అర్హతల వివరాలు :
ఈ ఉద్యోగాలకు కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేయుటకు అర్హులు.
SC , ST, PWD అభ్యర్థులు అయితే డిగ్రీ పాస్ అయితే చాలు.
అభ్యర్థి అప్లై చేసే రిక్రూట్మెంట్ ఆఫీస్ ఉండే రాష్ట్రంలో మాట్లాడే అధికారిక భాష వచ్చి ఉండాలి.
వయస్సు వివరాలు :
01-02-2026 తేదీ నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
వయసులో సడలింపు వివరాలు :
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఓబీసీ అభ్యర్థులకు వయస్సులో మూడేళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది.
PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు వరకు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ విధానం :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
SC , ST, PWD మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు 50/- రూపాయలు మరియు 18 శాతం జీఎస్టీ చెల్లించాలి.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు 450/- రూపాయలు మరియు 18 శాతం జీఎస్టీ చెల్లించాలి.
ఎంపిక విధానం :
అర్హతల అభ్యర్థులను ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష మరియు లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ తేదీలు :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 16వ తేదీ నుండి మార్చి 8వ తేదీ లోపు అప్లై చేయాలి.
ప్రిలిమినరీ పరీక్ష తేదీ :
అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ పరీక్షను 2026 లో ఏప్రిల్ 11వ తేదీన నిర్వహిస్తారు.
మెయిన్స్ పరీక్ష తేదీ :
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు 2026లో జూన్ 7వ తేదీన మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు :
చీరాల, గుంటూరు లేదా విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, కరీంనగర్, ఖమ్మం మరియు వరంగల్ లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో మెయిన్స్ పరీక్ష కేంద్రాలు :
కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు లేదా విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్ మరియు వరంగల్ లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసి మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తారు.
జీతం వివరాలు :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి ప్రారంభంలో నెలకు 58,514/- జీతం చెల్లిస్తారు.
✅ Download Full Notification – Click here
