Headlines

రైల్వేలో ఇక ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ | Railway Jobs Calendar 2024 | RRB Jobs Calendar 2024 | RRB ALP, Technician, NTPC, Group D , Paramedical Jobs Calendar Details

భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. ఈ సంవత్సరం రైల్వే లో ఉద్యోగాలు భర్తీ కోసం విడుదల చేయబోయే నోటిఫికేషన్స్ యొక్క వివరాలను తెలియజేస్తూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఒక క్యాలెండర్ విడుదల చేసింది.

 

దీని ప్రకారం ప్రతి సంవత్సరం ఏ నెలలో ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారో ముందుగానే వెల్లడించడం జరిగింది. ఇలా ప్రకటించడం వల్ల అభ్యర్థులకు ఏ నెలలో నోటిఫికేషన్ వస్తుందో ముందుగానే తెలుస్తుంది . కాబట్టి తమకు అర్హత గల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాకముందు నుండే బాగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది.

 

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ తాజాగా విడుదల చేసిన క్యాలెండర్ వివరాలు ఇలా ఉన్నాయి

 

✅ రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారికి మన యాప్ లో పూర్తి సిలబస్ ప్రకారం క్లాసులు అప్లోడ్ చేయడం జరిగింది.

 

RRB ALP , Technicians , NTPC, Group D ఉద్యోగాల ( తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ) పూర్తి కోర్స్ కేవలం 499/- లకే ఇస్తున్నాము. యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సులో ఉన్న డెమోక్రసీస్ చూసి మీకు నచ్చితేనే కోర్సు తీసుకోవచ్చు. 

 

APPSC గ్రూప్ 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 399/- రూపాయలకే..

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel

 

  • జనవరి నుండి మార్చి నెలల్లో ALP ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
  • ఏప్రిల్ నుండి జూన్ నెలల్లో టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
  • జూలై నుండి సెప్టెంబర్ నెలల్లో NTPC – గ్రాడ్యుయేట్ ( లెవెల్ 4,5&6 ) , NTPC – అండర్ గ్రాడ్యుయేట్ ( లెవెల్ 2&3 ) , జూనియర్ ఇంజనీర్స్, పారామెడికల్ కేటగిరీల నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు.
  • అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య గ్రూప్-D ( లెవెల్ 1) , మినిస్టీరియల్ & ఐసోలేటెడ్ క్యాటగిరి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

 

ఇందులో ఇప్పటికే 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.

 

ఇటీవల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఒక నోటీస్ విడుదల అయ్యింది. ఈ నోటీసు ప్రకారం రైల్వేలో 9,000 టెక్నీషియన్ ఉద్యోగాలకు ఈ ఫిబ్రవరిలో ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఒక సంవత్సరం కాలంలో ఈ ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి వచ్చే సంవత్సరం మరో నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ తాజాగా విడుదల చేసిన నోటీసులో వెల్లడించింది. 

 

అర్హతలు: టెక్నీషియన్ ఉద్యోగాలకు 10th + ITI లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వారు అర్హులు.

 

వయస్సు : 18 నుండి 33 సంవత్సరాలు

 

టెక్నీషియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మార్చి నుండి ఏప్రిల్ మధ్య ఆన్లైన్ లో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు.

 

ఈ ఉద్యోగాలు ఎంపికలో భాగంగా నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు 2024 లో అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య నిర్వహిస్తారు.

 

ఎంపికైన అభ్యర్థుల జాబితాను 2025 ఫిబ్రవరిలో విడుదల చేస్తారు.

 

ఈ నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 2025 ఏప్రిల్ లో టెక్నీషియన్స్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!