పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్ధులకు పోస్టల్ శాఖ గుడ్ న్యూస్ చెప్పంది . మొత్తం 78 పోస్టుల భర్తీకి అధికారికంగా పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది .
అర్హత , ఆసక్తి ఉన్న వారు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 16వ తేదీ లోపు ఆఫ్లైన్ లో అప్లై చేయాలి .
ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రెండు సంవత్సరాల ప్రోబేషన్ కాలం ఉంటుంది.
పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని అప్డేట్ చేయబడిన ఖాళీలు సమాచారం అధికారిక వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని నోటిఫికేషన్ లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ , అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులైన డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్ 2 ) పోస్టులను భర్తీ చేస్తున్నారు.
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : పోస్టల్ డిపార్ట్ మెంట్
మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 78
ఉద్యోగము పేరు : డ్రైవర్ ( ఆర్డినరీ గ్రేడ్ )
ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – పర్మినెంట్ ఉద్యోగాలు
అర్హతలు :
- పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
- లైట్ మరియు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- మోటార్ మెకానిజం నందు పరిజ్ఞానం కలిగి ఉండాలి.
అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 08-01-2024
అప్లై చేయడానికి చివరి తేదీ : 16-02-2024
కనీస వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 27 సంవత్సరాలు
వయస్సు సడలింపు : ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 సంవత్సరాల వయో సడలింపు కలదు. .
జీతం ఎంత ఉంటుంది : లెవెల్ 2 పే స్కేల్ ప్రకారం 19,900/- నుండి 63,200/-
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : రెండు స్టేజ్ లలో పరీక్ష నిర్వహిస్తారు.
స్టేజ్ 1 లో జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, మోటార్ మెకానిజం మరియు ట్రాఫిక్ రూల్స్ ,సిగ్నల్స్ & రెగ్యులేషన్ కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. 80 మార్కులకు గాను ఈ పరీక్ష నిర్వహిస్తారు.
స్టేజ్ 2 లో మోటార్ మెకానిజం మరియు డ్రైవింగ్ కి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు . 20 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
ఫీజు : 100/-
అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. .
అప్లికేషన్ పంపవసిన చిరునామా :
మెనేజర్ (GR.A ) ,
మెయిల్ మోటార్ సర్వీస్ కాన్పూర్,
GPO కాంపౌండ్, కాన్పూర్- 208001,
ఉత్తర ప్రదేశ్.
✅ నోటిఫికేషన్ & అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .