తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం , మెడికల్ & హెల్త్ డిపార్టుమెంటు పరిధిలో గల డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ , నిజామాబాద్ వారి నుండి నలుగురు సపోర్ట్ ఇంజనీర్స్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయింది.
నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా అవుట్సోర్సింగ్ ప్రాదిపతికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి విద్యార్హతలు , వయస్సు , దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
ఆహార ధాన్యాలు నిల్వ చేసే సంస్థలో ఉద్యోగాలు – Click here
రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ , నిజామాబాద్ వారి నుండి ఈ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
మొత్తం ఉద్యోగాల సంఖ్య : 04
భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- సపోర్ట్ ఇంజనీర్స్
విద్యార్హత :
- బి. టెక్ ( సిఎస్ఇ/ ఐటి/ ఇసిఇ ) / ఎం సి ఎ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- సంబంధిత రంగంలో టెక్నికల్ సపోర్ట్ గా కనీసం 4 సంవత్సరాల అనుభవం అవసరం.
వయస్సు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు దాటి వుండి , గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు లోపు వుండాలి.
- ఎస్సీ , ఎస్టీ , బీసీ , ఈడబ్లుఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & దివ్యాంగుల వారికి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
తెలంగాణ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు – Click here
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తు ను డౌన్లోడ్ చేసుకొని , ఫిల్ చేసి సంబంధిత ధృవపత్రాలు ను జత చేసి , ఆఫీస్ వారు కార్యాలయం నకు అందజేయాలి.
దరఖాస్తు అందించవలసిన చిరునామా :
- Dist. Medical & Health Office, Room No.201, IDOC, Nizamabad.
అప్లికేషన్ ఫీజు :
- ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హులను కలెక్టర్ అద్వర్యంలో గల డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది.
- అభ్యర్థులకు ఉద్యోగానికి సంబంధించిన విద్యార్హత లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక నిర్వహణ జరుగుతుంది.
జీతం:
- ఎంపిక అయిన వారికి 35,000/- రూపాయల నెలవారీ జీతం లభిస్తుంది.
ముఖ్యమైన తేదిలు:
- ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 16/12/2024 ( ఉదయం 10:30 నిముషాల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు)
- ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది :23 /12/2024 ( ఉదయం 10:30 నిముషాల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు)
Click here for official website
Click here to download application