తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG High court Office Subordinate Notification 2026

Telangana High Court Office Subordinate Syllabus
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

TS High Court Office Subordinate Notification 2026 Full Details : తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుండి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 7వ తరగతి లేదా పదవ తరగతి పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివింది. అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు ఫిబ్రవరి 28వ తేదీలోపు అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.

హైకోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉద్యోగాలు భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అయిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతల వివరాలు :

7వ తరగతి లేదా పదో తరగతి పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. పదో తరగతి కంటే అధిక విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనర్హులు.

వయస్సు వివరాలు :

01-07-2026 తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

వయసులో సడలింపు వివరాలు :

ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది. PWD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 7వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీలోపు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

జీతము వివరాలు :

19,000/- నుండి 58,850/- వరకు ఉండే పే స్కేల్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు జీతం చెల్లిస్తారు.

ఎంపిక విధానం వివరాలు :

అర్హులైన అభ్యర్థులను ఓఎంఆర్ ఆధారిత పరీక్ష నిర్వహించి పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

పరీక్ష విధానము వివరాలు :

అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఓఎంఆర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు.

పరీక్ష తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది.

పరీక్షలో జనరల్ నాలెడ్జ్ నుండి 45 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు.

ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది.

నెగిటివ్ మార్కులు ఉండవు.

పరీక్ష సమయం 60 నిమిషాలు.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఓసీ మరియు బీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 600/- రూపాయలు..

ఎస్సీ, ఎస్టీ, EWS మరియు PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 400/-

పరీక్ష తేదీ వివరాలు :

ఎంపిక ప్రక్రియలో నిర్వహించే పరీక్షను మే 2026లో నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆఫీస్ సభార్డినేట్ ఉద్యోగాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్స్ ప్రకటించింది.

గమనిక :

త ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.. ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

Download Full Notification – Click here

Official Website – Click here

ఇలాంటి వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో వెంటనే జాయిన్ అవ్వండి. మరియు ప్రతిరోజు మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *