నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం క్రింద తెలంగాణ రాష్ట్రం లో వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన వివిధ ప్రోగ్రాంలలో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్s విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా విడుదవుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన అన్ని నోటిఫికేషన్స్ క్రింద ఉన్న లింక్ ఉపయోగించి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తాజాగా కరీంనగర్ జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , కరీంనగర్ జిల్లా
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 45
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): కాంట్రాక్ట్ జాబ్స్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 పోస్టుల పేర్లు : వైద్యాధికారి, స్టాఫ్ నర్స్, ANM , DEO , MLHP, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఫార్మసిస్ట్, ఆప్టోమెట్రిస్ట్
🔥 పోస్టులు వారిగా వివరాలు : 👇👇👇
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 28-02-2024
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 02-03-2024
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు : తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥 ఫీజు :
వైద్యాధికారి ఉద్యోగాలకు – 500/-
మిగతా ఉద్యోగాలకు – 300/-
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : DMHO, కరీంనగర్
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.