SVIMS Staff Nurse Jobs Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ (Staff Nurse) ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) నుండి విడుదల అయ్యింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
Staff Nurse మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 236 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు వివరాలు :
- BSC నర్సింగ్ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన వారు అర్హులు. (లేదా)
- GNM అర్హతతో పాటు మూడు సంవత్సరాల అనుభవం ఉన్నవారు అర్హులు. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి
బీఎల్ఎస్ & ఏసీఎల్ఎస్ శిక్షణ ధృవపత్రాలు, కంప్యూటర్ అప్లికేషన్లలో పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
పే స్కేల్ :
38,720/- నుండి 1,18,390/- (RPS 2022) వరకు ఉండే పే స్కేల్ ప్రకారం జీతము చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అనుభవం మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తా.
వయస్సు వివరాలు :
01-07-2026 తేదీ నాటికి వయస్సు కనీసం 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు.
వయసులో సడలింపు వివరాలు :
ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, BC, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఓసి మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు : 2360/-
ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు : 1770/-
PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ తేదీలు :
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ యొక్క అధికారిక వెబ్సైట్లో జూలై 15వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీలోపు అప్లై చేయాలి.
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేయండి.
▶️ Download Notification – Click here
