AIIMS NORCET 10 Recruitment 2026 : దేశవ్యాప్తంగా ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబులిటీ టెస్ట్ (NORCET-10) ను ఢిల్లీలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఫిబ్రవరి 24వ తేదీ నుండి మార్చి 16వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఎయిమ్స్, న్యూ ఢిల్లీ నుండి విడుదల చేయబడిన ఈ షార్ట్ నోటిఫికేషన్ లో ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, అప్లికేషన్ ఫీజు, అప్లికేషన్ తేదీలు, జీతం, పరీక్ష తేదీలు మరియు ఇతర వివరాలు తెలుపబడ్డాయి. ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆన్లైన్లో త్వరగా అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీరు తెలుసుకోవాలి అంటే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులలో వెంటనే జాయిన్ అవ్వండి.
Table of Contents :
AIIMS NORCET 10 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
AIIMS NORCET 10 నోటిఫికేషన్ ను న్యూఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి విడుదల చేయడం జరిగింది.
AIIMS NORCET 10 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
AIIMS NORCET 10 నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న AIIMS మరియు ఇతర కేంద్ర ప్రభుత్వం వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..
AIIMS NORCET 10 మొత్తం ఖాళీల సంఖ్య :
AIIMS NORCET 10 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న మొత్తం ఖాళీల సంఖ్య తెలుపలేదు. కానీ దాదాపుగా 3,500 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.
ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు :
బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీగా రిజిస్టర్ అయిన వాళ్ళు అప్లై చేయవచ్చు. లేదా GNM అర్హత ఉన్నవారు GNM విద్యార్హత పూర్తయిన తర్వాత కనీసం 50 బెడ్స్ ఉన్న హాస్పిటల్ లో రెండేళ్లపాటు పనిచేసిన అనుభవం కలిగి ఉండి స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో మిడ్ వైఫరీగా రిజిస్టర్డ్ అయిన వాళ్ళు అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ తేదీలు :
అర్హులైన వారు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 24వ తేదీ నుండి మార్చి 16వ తేదీ లోపు అప్లై చేయాలి.
వయస్సు వివరాలు :
కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
వయస్సులో సడలింపు వివరాలు :
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పదేళ్లు వయస్సులో ప్రభుత్వ నిబంధనలో ప్రకారం సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
GEN / OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు : 3,000/- రూపాయలు
SC / ST / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు : 2,400/- రూపాయలు
PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
గమనిక : పరీక్ష రాసిన ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఎస్సీ / ఎస్టి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఫీజు రిఫండ్ చేస్తారు.
పరీక్ష తేదీలు :
స్టేజ్-1 ప్రిలిమినరీ పరీక్షను 11-04-2026 , స్టేజ్-2 మెయిన్స్ పరీక్షను 30-04-2026 తేదీన నిర్వహిస్తామని నోటిఫికేషన్ లో ప్రకటించారు.
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ముందుగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లికేషన్ చివరి తేదీ వరకు వేచి చూడకుండా త్వరగా అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం ఆ వెబ్సైట్ www.inbjobs.com ప్రతిరోజు ఓపెన్ చేయండి.
▶️ Download Notification – Click here
