ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో 11,648 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ఉద్యోగాలు అన్ని ప్రభుత్వ స్కూల్స్ మరియు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్ట్లు.
ఈ పోస్టుల్లో ముందుగా అక్టోబర్ 16వ తేదీన 3,282 పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖలో టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోందని ఆయన తెలిపారు. గతంలో అందిన సమాచారం మేరకు ఈ పోస్టుల ఖాళీల సంఖ్య – 8,366
🔥 జిల్లాల వారీగా టీచర్ పోస్టుల ఖాళీల సంఖ్య ఇదే – Click here
విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరుగుతుందని కూడా తెలిపారు.
విశ్వవిద్యాలయాల్లో సహాయ, అసోసియేట్, ఆచార్యుల పోస్టుల భర్తీకి ఈ నెల 16న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
సాధారణ విశ్వవిద్యాలయాలు, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వ విద్యాలయాల్లో కలిపి 3,282 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల కానుంది. విశ్వ విద్యాలయాల వారీగా ప్రకటనలు వెలువడిన అనంతరం సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
అనంతరం ఫలితాలను వర్సిటీలకు పంపిస్తారు.
ఈ మార్కుల ఆధారంగా వర్సిటీలు మౌఖిక పరీక్షలు నిర్వహించి, ఎంపిక చేసేలా ప్రణాళిక రూపొందించారు.
ఈ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఇదే వెబ్సైట్లో వెంటనే అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి తరుచుగా మా website Follow అవ్వండి.