ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జనవరి 16వ తేదీ నుండి జనవరి 25వ తేదీ లోపు అప్లై చేయాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) స్కీం నందు Quality Assurance and RBSK – DEIC Programmes నందు వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? జీతం ఎంత ఇస్తారు ? ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హతు ఉంటే తప్పనిసరిగా త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి.
🏹 విశాఖపట్నం DRDO లో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం , ఏలూరు జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ (క్వాలిటీ అష్యూరెన్స్) , మెడికల్ ఆఫీసర్ డెంటల్ , క్లినికల్ సైకాలజిస్ట్, ఆడియాలజిస్ట్ కం స్పీచ్ తెరపిస్ట్, స్టాఫ్ నర్స్ అనే ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసినందుకు అర్హత గల వారి నుంచి దరఖాస్తు కోరుతున్నారు.
🔥 అర్హతలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి క్రింది విధంగా విద్యార్హతలు ఉండాలి.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఏడు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ఆడియాలజిస్ట్ కం స్పీచ్ తెరపిస్ట్ పోస్టులు మూడు ఉన్నాయి. మిగతా ఉద్యోగాలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.
🔥 వయస్సు :
- 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
- SC, ST, BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🏹 AIIMS మంగళగిరి లో ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ ఫీజు :
- నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు 300/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
- District Medical & Health Officer, ఏలూరు జిల్లా, ఏలూరు అనే పేరు మీద DD రూపంలో చెల్లించాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- 16-01-2025 తేది నుండి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 25-01-2025
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
- జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం , ఏలూరు జిల్లా
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here
✅ Official Website – Click here