ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమలో కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రెండు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేసారు.
ఈ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో పదో తరగతి అర్హతతో కూడా భర్తీ చేస్తున్న పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అన్నీ మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు త్వరగా ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోండి.
✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- ప్రస్తుతం ఈ నోటిఫికేషన్స్ కృష్ణా జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం DMHO కార్యాలయం నుండి విడుదల చేయడం జరిగింది.
🔥 పోస్టుల పేర్లు:
- ఫిజిషియన్ / మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ , DEIC మేనేజర్ , ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, FNO మరియు శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్ మెన్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 ఖాళీలు :
- రెండు కలిపి మొత్తం 27 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 జీతము:
- ఫిజిషియన్ ఉద్యోగాలకు 1,10,000/- జీతం ఇస్తారు.
- మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు 61,960/- జీతము ఇస్తారు.
- ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్ ఉద్యోగాలకు 30,000/- జీతం ఇస్తారు.
- స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు 27,675/- జీతం ఇస్తారు.
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ఉద్యోగాలకు 32,670/- జీతం ఇస్తారు.
- DEIC మేనేజర్ ఉద్యోగాలకు 36,465/- జీతము ఇస్తారు.
- FNO ఉద్యోగాలకు 15,000/- జీతము ఇస్తారు.
- శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్ మెన్ ఉద్యోగాలకు 15,000/- జీతము ఇస్తారు.
🔥 అప్లికేషన్ తేదీలు :
- ఫిజిషియన్ / మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ , DEIC మేనేజర్ , ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ ఉద్యోగాలకు డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 17వ తేదీలోపు అప్లై చేయాలి.
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, FNO మరియు శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్ మెన్ ఉద్యోగాలకు డిసెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 16వ తేదీలోపు అప్లై చేయాలి.
🔥 విద్యార్హత :
- పదో తరగతి, GNM లేదా B.Sc (నర్సింగ్), B.Sc (MLT) , DMLT , MBBS మరియు పోస్టులను అనుసరించి వివిధ విద్యార్హతలు ఉన్న వారు అప్లై చేయవచ్చు.
🔥 ఫీజు :
- ఫిజిషియన్ / మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ , DEIC మేనేజర్ , ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ ఉద్యోగాలకు అప్లై చేసే ఓసి / బీసీ అభ్యర్థులు అయితే 300/- ఫీజు చెల్లించాలి. మిగతా అభ్యర్థులు 100/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, FNO మరియు శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్ మెన్ ఉద్యోగాలకు అప్లై చేసే ఓసి అభ్యర్థులు అయితే 250/- ఫీజు చెల్లించాలి మిగతా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
🔥 వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. (01-12-2024 నాటికి)
🔥 వయసులో సడలింపు :
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది.
- అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
- ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వరకు వయసులో సడలింపు వర్తిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
- మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అభ్యర్థులకు అర్హత పరీక్షలు వచ్చిన మార్కులు, పోస్టులను అనుసరించి ఉండవలసిన అర్హతలు పూర్తి చేసిన సంవత్సరం నుండి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకు మార్కులు కేటాయింపు మరియు గతంలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి వెయిటేజీ మార్కుల కేటాయింపు వంటి వాటి ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
- District Medical and Health Officer, Parasupeta, Near Nayarbaddi centre, Machilipatnam, Krishna district
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి.
🔥 ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.
🔥 Official Website – Click here