తెలంగాణలో రాష్ర్టంలో 732 ఫార్మసిస్ట్ గ్రేడ్ -2 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా నవంబర్ 30న నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష ప్రాథమిక “కీ” ను మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది.
అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని తమకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకునేందుకు అవకాశం ఉంది. “కీ” పైన అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్సైట్ లో డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి నుండి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు Key పై Objections పెట్టుకోవచ్చు. అభ్యంతరాలు పెట్టే ప్రతి ఒక్క అభ్యర్థి మాస్టర్ క్వశ్చన్ పేపర్ లో ఉన్న క్వశ్చన్ ఐడీల ఆధారంగా అబ్జెక్షన్ పెట్టాలి.
- నవంబర్ 30వ తేదీన హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ మరియు నర్సంపేట లలో నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష రెండు సెషన్స్ లలో నిర్వహించడం జరిగింది.
- రెండు సెషన్స్ లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించడం కారణంగా బోర్డు ముందుగానే తెలియజేసిన విధంగా మార్కుల నార్మలైజేషన్ చేస్తారు. ఈ విధంగా నార్మలైజేషన్ చేయడం వలన అభ్యర్థులకు “కీ” చూసిన తర్వాత వచ్చిన మార్కులకు నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన మార్కులకు తేడా ఉంటుంది. అంటే నార్మలైజేషన్ చేయడం వలన సులభంగా వచ్చిన షిఫ్ట్ లో రాసిన అభ్యర్థులకు మార్కులు సంఖ్య నార్మలైజేషన్ చేసిన తర్వాత తగ్గుతుంది. కఠినంగా వచ్చిన షిఫ్ట్ లో పరీక్ష రాసిన అభ్యర్థులకు నార్మలైజేషన్ చేసిన తర్వాత మార్కుల సంఖ్య పెరుగుతుంది..
- అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి రెస్పాన్స్ షీట్ మరియు మాస్టర్ క్వశ్చన్ పేపర్ ను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- “కీ” పైన అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్సైట్ లో డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు Key Objections పెట్టుకోవచ్చు. అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే ఇలా అబ్జెక్షన్ పెట్టడానికి అవకాశం ఉంది. ఒకేసారి ఎన్ని ప్రశ్నలకైనా Key Objections పెట్టవచ్చు. ఈ విధంగా గ్రీవెన్స్ పెట్టడానికి అభ్యర్థులు తప్పనిసరిగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ PDF లేదా JPEG Format లో అప్లోడ్ చేయాలి.
🏹 Official Website – Click here
ఈ సంవత్సరం ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ పోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో మొత్తం 633 పోస్టులకు భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో బోర్డు పేర్కొంది. కానీ తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన మరో 99 ఫార్మసిస్ట్ 2 ఉద్యోగాలు కూడా ఇదే నోటిఫికేషన్లో జతపరిచి మొత్తం 722 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు బోర్డు తర్వాత తెలిపింది.
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించింది.
బోర్డు చెప్పిన విధంగానే నవంబర్ 30వ తేదీన పరీక్ష కూడా నిర్వహించింది.
🔥 ఎంపిక విధానము : ఈ ఉద్యోగాల ఎంపికలో మొత్తం 100 పాయింట్లకు ఎంపిక చేస్తారు.
- ఇందులో 80 పాయింట్లు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.
- 20 పాయింట్లు గతంలో కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థలు, ప్రోగ్రాం లలో పనిచేసిన వారికి వెయిటిజి మార్కులు ఇస్తారు.
🔥 భర్తీ చేయబోయే మొత్తం ఖాళీల సంఖ్య : 722
🔥 జీతము :
- తెలంగాణలో ఫార్మసిస్ట్-2 ఉద్యోగాలకు 31,040/- నుండి 92,050/- వరకు పేస్కేల్ ఉంటుంది.