Headlines

బ్యాంక్స్ లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | Karnataka Bank Customer Service Associate Recruitment 2024 | KBL CSA Notification 2024

మంగుళూరు ప్రధాన కేంద్రంగా గల లీడింగ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయినటువంటి కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ సంస్థ  నుండి కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం ,పరీక్షా విధానం , పరీక్షా కేంద్రాలు మొదలగు  పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ లో తెలుపలేదు

🔥 విద్యార్హత : 

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వుండాలి.
  • అభ్యర్థులు 01/11/2024 లోగా ఉత్తీర్ణత సాధించి వుండాలి.

🔥  గరిష్ట వయస్సు :

  • అభ్యర్థుల వయస్సు 26 సంవత్సరాల లోపు వుండాలి.
  • వయస్సు నిర్ధారణకు 01/11/2024 ను కట్ ఆఫ్  తేది గా నిర్ధారించారు.
  • అభ్యర్థులు 02/11/1998 కంటే ముందుగా జన్మించి వుండరాదు.
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయొ సడలింపు కలదు.
  • ఓబీసీ అభ్యర్థులకు వయస్సులో 3 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • జనరల్ , OBC ,ఇతరులు అభ్యర్థులు 750 రూపాయలు
  • ఎస్సీ ,  ఎస్టీ ,600 రూపాయలు అప్లికేషన్ ఫీజు గా చెల్లించాలి.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులకు 15/12/2024 న ఆన్లైన్ పరీక్ష  నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • అభ్యర్థులకు దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్ర స్థానిక భాష వచ్చి వుండాలి , స్థానిక భాష నైపుణ్యత ను పరిశీలించి ( లాంగ్వేజ్ ప్రోఫిసియన్సీ టెస్ట్ ) నియామకం చేస్తారు.

 🔥 ఆన్లైన్ పరీక్షా విధానం :

  • మొత్తం 200 మార్కులకు గాను , పరిక్ష నిర్వహిస్తారు.
  • ఇందులో రీజనింగ్ , ఇంగ్లీష్ లాంగ్వేజ్ , కంప్యూటర్ నాలెడ్జ్ , జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ సబ్జెక్టులు కు ఒక్కో దాని నుండి 40 ప్రశ్నలు , 40 మార్కుల చొప్పున కేటాయించారు.
  • 135 నిముషాలలో పరీక్ష ను పూర్తి చేయాలి.
  • ప్రతి తప్పు సమాధానానికి కి ¼ వంతు నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు.

🔥 పరీక్ష కేంద్రాలు : 

  • దేశంలోని పలు ప్రముఖ నగరాలతో పాటు   తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ ను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు.

🔥 జీతం

  • 24,050 /- రూపాయల బేసిక్ పే తో ,అన్ని అల్లోవన్స్ లు కలిపి  వీరికి నెలకి 59,000/- రూపాయలకు పైగా జీతం లభిస్తుంది

🔥 ప్రొబేషన్ పీరియడ్

  • ఎంపిక కాబడిన అభ్యర్థులు ఆరు నెలలు పాటు ప్రొబెషన్ పీరియడ్ లో వుంటారు.

🔥 సర్వీస్ బాండ్: 

  • ఎంపిక కాబడిన అభ్యర్థులు 3 సంవత్సరాలు బ్యాంక్ వారి సర్వీస్ లో పని చేసే విధంగా సర్వీస్ బాండ్ కు కట్టుబడి వుండాలి.

🔥 ముఖ్యమైన తేదిలు:

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 20/11/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 30/11/2024
  • టెన్టేటివ్ ఆన్లైన్ పరీక్షా తేది :15/12/2024

👉  Click here for notification 

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!