ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్,  పార్ట్ టైం ఉద్యోగాలు | AP WD&CW Department Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయం నుండి మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా బాలసదన్ లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు  ఉండవలసిన అర్హతలు, జీతము, ఎంపిక విధానము, అప్లికేషన్ విధానము వంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ మీరు చివరి వరకు చదివితే అర్థమవుతాయి. పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకొని మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.

🏹 రైల్వేలో 3115 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ శ్రీ సత్య సాయి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం నుండి విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా ధర్మవరం మరియు హిందూపూర్ లో ఉన్నటువంటి చిల్డ్రన్ హోమ్స్ లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి వారి కార్యాలయం , శ్రీ సత్య సాయి జిల్లా

 🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : స్టోర్ కీపర్ కం అకౌంటెంట్, హౌస్ కీపర్ , ఎడ్యుకేటర్, ఆర్ట్ & క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్, PET ఇన్స్ట్రక్టర్ కం యోగ టీచర్, కుక్, హెల్పర్ కం నైట్ వాచ్మెన్

🔥 అర్హతలు : పదో తరగతి, డిగ్రీ, B.Ed, డిప్లొమా వంటి విద్యార్హతలతో పాటు పని అనుభవం ఉండాలి.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 12

  • స్టోర్ కీపర్ కం అకౌంటెంట్ – 02
  • హౌస్ కీపర్ – 02
  • ఎడ్యుకేటర్ – 02
  • ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్ – 04
  • PET ఇన్స్ట్రక్టర్ కం యోగ టీచర్ – 02
  • కుక్ – 01
  • హెల్పర్ కం నైట్ వాచ్మెన్ – 01

🔥 జీతము : పోస్టులు వారీగా జీతము వివరాలు  క్రింది విధంగా ఉన్నాయి.

  • స్టోర్ కీపర్ కం అకౌంటెంట్ – 18,536/-
  • హౌస్ కీపర్ – 7,944/-
  • ఎడ్యుకేటర్ – 5000/-
  • ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్ – 5,000/-
  • P.T ఇన్స్ట్రక్టర్ కం యోగ టీచర్ – 10,000/-
  • కుక్ – 9930/-
  • హెల్పర్ కం నైట్ వాచ్మెన్ – 7,944/- 

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు 

🔥 వయస్సు : 30 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • పోస్టుల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ సమాచారం తెలియజేస్తారు.
  • ఇంటర్వ్యూ సమాచారం అందిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది.
  • ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 01-10-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 10-10-2024

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అదికారి , శ్రీ సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురుగా, శ్రీ సత్య సాయి జిల్లా వారి కార్యాలయం నందు ఈ ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తున్నారు.

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!