ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆయన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుండి 550 పోస్టులతో అప్రెంటిస్ పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 28వ తేదీ నుండి సెప్టెంబర్ 10వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్రాంచ్ లలో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా పోస్టింగ్ ఇస్తారు. ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు.
ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానం, జీతము మరియు ఇతర ముఖ్యమైన వివరాలు అన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అప్రెంటిస్ పోస్టులు
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 550
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22 పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఉండవలసిన కనీస వయస్సు – 20 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : ఈ పోస్టులకు 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అర్హులు.
🔥 వయస్సులో సడలింపు : ఈ పోస్టులకు అప్లై చేసే వారికి భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో క్రింది విధంగా సడలింపు వర్తిస్తుంది. అనగా
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- ఓబిసి (నాన్ క్రీమీలేయర్) అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 స్టైఫండ్ : ఈ పోస్టులకు ఎంపికైన వారికి క్రింది విధంగా స్టైఫండ్ ఇస్తారు. అభ్యర్థులు పొండి పోస్టింగ్ ప్రాంతాన్ని బట్టి ఈ స్టైఫండ్ ఉంటుంది.
- మెట్రో ప్రాంతాల్లో పోస్టింగ్ పొందిన వారికి 15,000/- స్టైఫండ్ ఇస్తారు
- అర్బన్ ప్రాంతాల్లో పోస్టింగ్ పొందిన వారికి 12,000/- స్టైఫండ్ ఇస్తారు
- రూరల్ ప్రాంతాల్లో పోస్టింగ్ పొందిన వారికి 10,000/- స్టైఫండ్ ఇస్తారు.
🔥 అర్హత :
- ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి.
- అభ్యర్థి అప్లై చేసే రాష్ట్రంలో మాట్లాడి స్థానిక భాష వచ్చి ఉండాలి.
🔥 ఫీజు :
- GEN / EWS / OBC అభ్యర్థులకు ఫీజు 800/- ( జీఎస్టీ తో కలుపుకొని 944/- )
- SC, ST, Female అభ్యర్థులకు ఫీజు 600/- ( జీఎస్టీతో కలుపుకొని 708/- )
- PwBD అభ్యర్థులకు ఫీజు 400/- ( జీఎస్టీ తో కలుపుకొని 472/- )
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 28-08-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 10-09-2024
🔥 ఆన్లైన్ పరీక్ష తేదీ : 22-09-2024
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి వివరాలు అన్ని చదివి అప్లై చేయండి.
✅ Download Notificaion – Click here