తెలంగాణ రాష్ట్రంలో 12 సంవత్సరాలు తర్వాత భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. 3,035 పోస్టులు భర్తీకి ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భర్తీ చేయబోయే పోస్టులలో పదో తరగతి అర్హతతోనే ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నాయి.
గత 12 ఏళ్ల నుంచి ఆర్టీసీలో కారుణ్య నియామకాలు తప్ప ఇతర పోస్టుల భర్తీ జరగలేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలో భారీ స్థాయిలో ఖాళీలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా మహాలక్ష్మి పథకం కారణంగా ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య పది లక్షలు పెరిగింది. మరోపక్క సిబ్బంది పదవి విరమణ కారణంగా ఉద్యోగులపై ఒత్తిడి కూడా పెరిగింది. రద్దీ కూడా పెరిగిన నేపథ్యంలో 4000 కొత్త బస్సులు అవసరమని ఆర్టీసీ తేల్చింది. అయితే ముందుగా 1500 బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్లు , కండక్టర్లు అవసరం ఏర్పడింది.
కొత్త బస్సులు వచ్చేలోపు ఉద్యోగాల భర్తీ అవసరమని ఆర్టీసీ ముఖ్యమంత్రి గారి ముందు ఉంచిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
- డ్రైవర్ – 2,000
- శ్రామిక్ – 743
- డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) – 114
- డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) – 84
- డిప్యూటీ మేనేజర్ లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25
- అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ – 15
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23
- సెక్షన్ ఆఫీసర్ (సివిల్) – 11
- అకౌంట్స్ ఆఫీసర్ – 06
- మెడికల్ ఆఫీసర్ (జనరల్) – 07
- మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) – 07
కారుణ్య నియామకాలు ద్వారా కండక్టర్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉండడంతో ఈ పోస్టుల భర్తీకి ఆర్టీసీ ప్రతిపాదనలు పంపించలేదని సమాచారం. ప్రస్తుతం అనుమతి వచ్చిన పోస్టులకు త్వరితగతిన నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
టిఎస్ఆర్టిసి ని కొత్త రక్తంతో నింపుతామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారు తెలిపారు. పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంతో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.