ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను స్వయంగా వెళ్లి లేదా పోస్టు ద్వారా పంపించాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అప్లై చేయండి.
నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వ సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క APSP 4th బెటాలియన్ లో ఉన్న ఖాళీలు భర్తీ కోసం విడుదల చేయబడింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్, స్కావెంజర్లు, కుక్, దోబీ, బార్బర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 37 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతల వివరాలు :
పోస్టులను అనుసరించి 7వ తరగతి, పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
జీతము వివరాలు :
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 15,000/- రూపాయలు చొప్పున జీతము చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ తేదీలు:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 27వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీలోపు అప్లై చేయాలి.
అభ్యర్థుల ఎంపిక విధానం :
పోస్టులను అనుసరించి అభ్యర్థులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ పంపించాల్సిన లేదా అందజేయాల్సిన చిరునామా :
The Commandant
4th IR Battalion, APSP,
Besides 42 Bn CRPF,
A.V. Apparao Road, Lalacheruvu,
Rajamahendravaram.
East Godavari District -533106
▶️ Download Notification – Click here
✅ Download Application – Click here
✅ Download Press Note – Click here
✅ Official Website – Click here
