తెలంగాణ NHM లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

NHM Jobs in Telangana
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Telangana NHM Notification 2026: తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) లో భాగంగా బస్తీ దవాఖానాల్లో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణలో రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నుండి విడుదల అయ్యింది.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 33 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

నోటిఫికేషన్ ద్వారా 13 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, 16 స్టాఫ్ నర్స్ పోస్టులు, 4 సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హతలు :

  • మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు MBBS అర్హతతో పాటు AP / TS మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
  • స్టాఫ్ నర్స్ పోస్టులకు GNM / BSC నర్సింగ్ పూర్తి చేసి నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
  • సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి.

వయస్సు వివరాలు :

01-07-2026 తేదీ నాటికి వయస్సు 18 సంవత్సరాలు నుండి 44 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.

వయస్సులో సడలింపు వివరాలు :

  • SC, ST, BC అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
  • PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక విధానం వివరాలు :

ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ తేదీలు :

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను 03-08-2026 తేదీ నుండి 10-08-2026 తేదీలోపు అప్లై చేయాలి.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

O/o District Medical & Health Officer, Rangareddy District, Near Pillar No.294 of PVNR Express Way, Manikanta Colony, Shivarampally, Rajendra Nagar, Rangareddy District.

▶️ Download Notification – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *