AP జాబ్ క్యాలెండర్ ద్వారా 10,060 పోస్టులకు 41 నోటిఫికేషన్స్ విడుదల

AP Jobs Calendar 2026 Vacancies pdf
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP Jobs Calendar Department Wise Vacancies List : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది రోజున రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.. 10,060 పోస్టులుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. గ్రూప్ -1, గ్రూప్ -2 , పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, టీచర్, లెక్చరర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, లైబ్రేరియన్, ఇంజనీర్ మరియు ఇతర చాలా రకాల ఉద్యోగాలు ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

మొత్తం నాలుగు విడతల్లో జాబ్స్ క్యాలెండర్ ద్వారా 41 నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు. ఇందులో మొదటి విడతలో మే 15వ తేదీన ఒక నోటిఫికేషన్ , రెండో విడతలో ఆగస్ట్ 15వ తేదీన 25 నోటిఫికేషన్స్, మూడో విడతలో సెప్టెంబర్ 15వ తేదీన 9 నోటిఫికేషన్స్, నాలుగో విడతలో అక్టోబర్ 15వ తేదీన 6 నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు.

మే 15న తేదీన విడుదల చేసే నోటిఫికేషన్స్ ద్వారా మొత్తం 1500 పోస్టులు భర్తీ చేస్తారు.

ఆగస్టు 15వ తేదీన విడుదల చేసే నోటిఫికేషన్స్ ద్వారా మొత్తం 3797 పోస్టులు భర్తీ చేస్తారు.

సెప్టెంబర్ 15న విడుదల చేసే నోటిఫికేషన్స్ ద్వారా మొత్తం 1759 పోస్టులు భర్తీ చేస్తారు.

అక్టోబర్ 15న విడుదల చేసే నోటిఫికేషన్స్ ద్వారా మొత్తం మొత్తం 3004 పోస్టులు భర్తీ చేస్తారు.

Download Department Wise Vacancies List – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *