ఆంధ్రప్రదేశ్ లో జాబ్స్ క్యాలెండర్ 2026 విడుదల | శాఖల వారీగా వివరాలు ఇవే…

AP Jobs Calendar Vacancies List Released
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Andhrapradesh Jobs Calendar 2026 Pdf : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని గతంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు మరియు ఇతర మంత్రులు కూడా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. జనవరిలో విడుదల చేయాల్సిన ఈ జాబ్స్ క్యాలెండర్ కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు వివిధ శాఖల వారీగా ఖాళీల సమచారం సేకరించారు.

13-03-2026 తేదీన వివిధ శాఖల్లో ఖాళీలు ఫైనల్ చేశారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు మరియు మొత్తం భర్తీ చేస్తున్న ఉద్యోగాల వివరాలు తెలుసుకునేందుకు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పిడిఎఫ్ Download చేసుకోండి. ప్రతీ రోజూ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.

జాబ్స్ క్యాలెండర్ మొత్తం ఖాళీలు :

ఆంధ్రప్రదేశ్ జాబ్స్ క్యాలెండర్ ద్వారా మొత్తం 10,060+ పైగా ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

జాబ్స్ క్యాలెండర్ విడుదల తేదీ :

ఆంధ్రప్రదేశ్ లో జాబ్స్ క్యాలెండర్ ఉగాది సందర్భంగా అనగా మార్చి 13వ తేదీన విడుదల చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

▶️ Download Vacancies PDF – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *