ఆంధ్రప్రదేశ్ లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల | AP Staff Nurse Jobs Recruitment 2026

Andhrapradesh Staff Nurse Jobs Recruitment 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Andhra Pradesh Staff Nurse Jobs Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు మార్చి 17వ తేదీ నుండి మార్చి 25వ తేదీ లోపు అప్లై చేయాలి..

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, అప్లికేషన్ విధానం మరియు ఇతర వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు తెలుసుకునేందుకు మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాంతీయ వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, గుంటూరు నుండి విడుదలైంది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా పల్నాడు జిల్లాలో పిడుగురాళ్లలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు..

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హతల వివరాలు :

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు GNM లేదా Bsc Nursing విద్యార్హతలు కలిగి ఉన్న వారు అర్హులు.

వయస్సు వివరాలు :

అభ్యర్థుల వయస్సు 01-03-2026 తేదీ నాటికి 42 సంవత్సరాలలోపు ఉన్న వారు అర్హులు.

SC, ST , BC, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ తేదీలు :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు 17-03-2026 తేదీ నుండి 25-03-2026 తేదీల మధ్య అభ్యర్థులు అప్లై చేయాలి.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

OC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 500/- రూపాయలు

SC, ST, BC , PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 300/- రూపాయలు

అప్లై చేసే అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫీజు Regional Director Medical and Helath Service’s, Guntur అనే పేరు మీద DD తీసి అప్లికేషన్ కు జతపరచాలి.

అభ్యర్థుల ఎంపిక విధానం :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన తర్వాత అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు మరియు అనుభవానికి మార్కుల కేటాయింపు వంటి వాటిని ఆధారంగా చేసుకొని మార్కుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు తమ అప్లికేషన్ ప్రాంతీయ వైద్య , ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం, అశ్విని హాస్పిటల్ వెనుక, పాత ఇటుకల బట్టి రోడ్, గుంటూరు నందు తమ అప్లికేషన్ అందజేయాలి.

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

▶️ Download Full Notification – Click here

▶️ Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *