ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ | AP Helath Department Jobs Recruitment 2026

AP Health Department Jobs Notification 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Andhrapradesh Government Health Department Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ మిషన్ డైరెక్టర్ ఆదేశాలు మేరకు ప్రభుత్వ ఆసుపత్రులు మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ రెండు నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డైరెక్టర్ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ , జాతీయ ఆరోగ్య మిషన్ కమిషన్ డైరెక్టర్ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి విడుదలైంది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఫార్మసిస్ట్ గ్రేడ్-2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, STS, ఫిజియోథెరపిస్ట్, ఆడియాలజిస్ట్ కం స్పీచ్ తెరపిస్ట్, ఆటోమేట్రిస్ట్, ఎర్లీ ఇంటర్వెన్స్స్ట్ కం స్పెషల్ ఎడ్యుకేటర్, చైల్డ్ సైకాలజిస్ట్ , డెంటల్ టెక్నీషియన్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

వయస్సు వివరాలు :

18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

వయస్సులో సడలింపు వివరాలు :

SC, ST, BC, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం వివరాలు :

అర్హత ఉన్న అభ్యర్థులను రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రూరల్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

OC, BC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 200/- రూపాయలు

SC , ST, PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 100/- రూపాయలు

అప్లికేషన్ చివరి తేదీ :

అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 26వ తేదీలోపు అప్లై చేయాలి.

అప్లికేషన్ అందించాల్సిన చిరునామా :

డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, విశాఖపట్నం నందు అభ్యర్థులు తమ అప్లికేషన్ అందజేయాలి.

ముఖ్యమైన గమనిక :

అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు తప్పనిసరిగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకొని అప్లై చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త నోటిఫికేషన్లు సమాచారం ప్రతిరోజు తెలుసుకునేందుకు మా వెబ్సైట్ www.inbjobs.com వెబ్సైట్ ఓపెన్ చేయండి.

Download Notification – 1

Download Notification -2

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *