ఆంధ్ర ప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | AP Outsourcing Jobs Recruitment 2026

AP Outsourcing Jobs Selection Process
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP Outsourcing Jobs Latest Notification 2026 : హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 7వ తరగతి లేదా పదో తరగతి అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 17వ తేదీ లోపు అప్లై చేయాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరగా అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు తెలుసుకునేందుకు మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులలో వెంటనే జాయిన్ అవ్వండి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కృష్ణ జిల్లా, మచిలీపట్నంలో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి విడుదల అయ్యింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 03 ఆఫీస్ సబార్డిబేట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

అర్హతలు :

7వ తరగతి లేదా పదో తరగతి పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు

ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు, కానీ ఇంటర్మీడియట్ పాస్ లేదా ఇతర అదిక అర్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనర్హులు.

వయస్సు వివరాలు :

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు 01-01-2026 తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 42 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.

వయస్సులో సడలింపు ఉంటుందా ? :

అవును, SC, ST, BC అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు పాటు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం వివరాలు :

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులను గౌరవ హైకోర్టు మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ APCOS మార్గదర్శకాలు ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ చివరి తేదీ వివరాలు :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 17వ తేదీలోపు అప్లై చేయాలి

జీతం వివరాలు :

ఎంపికైన వారికి నెలకు 15,000/- రూపాయలు జీతం చెల్లిస్తారు.

అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా వివరాలు :

ది చైర్ పర్సన్, డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, మచిలీపట్నం, కృష్ణ జిల్లా.

✅ అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి మిగతా ఉద్యోగాల సమాచార ప్రతీ రోజూ తెలుసుకోవడానికి మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతీ రోజూ ఓపెన్ చేయండి.

Download Full Notification & Application – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *