పరీక్ష లేకుండా ఆంధ్ర ప్రదేశ్ NHM లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP NHM Jobs Recruitment 2026

Andhra Pradesh Contract Basis Jobs Recruitment 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP NHM Latest Jobs Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతి ఆరోగ్య మిషన్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 20వ తేదీలోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ వరకు చదవండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చిత్తూరు జిల్లాలో జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి విడుదలైంది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో జాతీయ ఆరోగ్య మిషన్ లో ఖాళీగా ఉన్న డేటా మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మైక్రో బయాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 , ల్యాబ్ అటెండెంట్ అనే పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

డేటా మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 36,225/- రూపాయలు జీతం ఇస్తారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 18,450/- రూపాయలు జీతం ఇస్తారు.

మైక్రో బయాలజిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 45,282/- రూపాయలు జీతం ఇస్తారు.

ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 23,393/- రూపాయలు జీతం ఇస్తారు.

ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 15,000/- రూపాయలు జీతం ఇస్తారు.

అర్హతల వివరాలు :

ఈ ఉద్యోగాలకు క్రింద తెలిపిన విధంగా విద్యార్హతలు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు.

Andhra Pradesh NHM Notification 2026

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు DM&HO , Chittoor పేరు మీద చెల్లుబాటు అయ్యేందుకు ఏదైనా జాతీయ బ్యాంకులో DD తీసి అప్లికేషన్ కు జతపరచాలి.

అప్లికేషన్ చివరి తేదీ :

చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 20వ తేదీ లోపు అప్లై చేయాలి.

ఎంపిక విధానం వివరాలు :

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను రాత పరీక్ష లేకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి, చిత్తూరు వారి కార్యాలయంలో అభ్యర్థి స్వయంగా వెళ్లి అప్లికేషన్ స్వయంగా వెళ్లి అందజేయాలి

అప్లికేషన్ కు జతపరచాల్సిన డాక్యుమెంట్స్ :

1 నింపిన దరఖాస్తు ఫారం కు తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో అతికించాలి.

2 SSC (లేదా) సమానమైన సర్టిఫికెట్ యొక్క మార్కుల మెమో యొక్క ధృవీకరించబడిన కాపీ జతపరచాలి.

3 అర్హత పొందిన అన్ని సంవత్సరాల మార్కుల మెమోల యొక్క ధృవీకరించబడిన కాపీలు జతపరచాలి.

4 తాత్కాలిక / శాశ్వత అర్హత సర్టిఫికేట్ యొక్క ధృవీకరించబడిన కాపీలు జతపరచాలి.

5 గౌరవనీయ కౌన్సిల్ / బోర్డు యొక్క శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ యొక్క ధృవీకరించబడిన కాపీ జతపరచాలి.

6 తాజా కుల ధృవీకరణ పత్రం యొక్క ధృవీకరించబడిన కాపీ (SC/ST/BC విషయంలో) జతపరచాలి.

7 అభ్యర్థి చదివిన తరగతి–IV నుండి X వరకు అధ్యయన ధృవీకరణ పత్రాల యొక్క ధృవీకరించబడిన కాపీలు జతపరచాలి.

8 శారీరకంగా వికలాంగుల సర్టిఫికేట్ యొక్క తాజా ధృవీకరించబడిన కాపీ / మాజీ సైనికులు (వర్తిస్తే) జతపరచాలి.

9 అభ్యర్థి అనుభవ ధృవీకరణ పత్రం యొక్క ధృవీకరించబడిన కాపీ (వర్తిస్తే) జతపరచాలి .

0 అభ్యర్థి ఆధార్ సర్టిఫికేట్ యొక్క ధృవీకరించబడిన కాపీ (తప్పనిసరి) జతపరచాలి.

11 ఏదైనా జాతీయం చేయబడిన బ్యాంకు నుండి తీసుకున్న R.500/- డిమాండ్ డ్రాఫ్ట్ ను జత పరచాలి.

✅ అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా క్రింది ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్స్ తెలుసుకోండి.

▶️ Download Full Notification – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *