ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయాలు ( కలెక్టరేట్లు) , అసెంబ్లీ ,పార్లమెంట్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు మంజూరైన 982 పోస్టులను త్వరగా భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఇటీవల ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ ఉద్యోగాల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల కావడం ప్రారంభం అయినది.
ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్స్ పోస్టులను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కు ఎలా అప్లై చేయాలి ? ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక ఎలా ఉంటుంది ? అర్హత ఏమిటి ? జీతం ఎంత ఇస్తారు ? వంటి పూర్తి వివరాలు దిగువన ఇవ్వబడినవి.
✅ పేద నిరుద్యోగులకు సంక్రాంతి పండుగ సందర్భంగా అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లోని క్లాసులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్స్ కార్యాలయాల్లో మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న డేటా ఎంట్రీ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా పేరు : పార్వతీపురం మన్యం జిల్లా
పోస్టుల పేర్లు : డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఆఫీస్ సబార్డినేట్స్
మొత్తం ఉద్యోగాలు : 14
డేటా ఎంట్రీ ఆపరేటర్లు – 07
ఆఫీస్ సబర్డినేట్స్ – 07
అర్హత :
డేటా ఎంట్రీ ఆపరేటర్లు – ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
ఆఫీస్ సబర్డినేట్స్ – 10వ తరగతి ఉత్తీర్ణత
అప్లికేషన్ చివరి తేదీ : 08-02-2024
ఫీజు : లేదు
వయస్సు : 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా వెళ్లి / రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ అందజేయాలి.
ఎంపిక విధానము: అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ అందజేయాల్సిన / పంపించాల్సిన చిరునామా : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కలెక్టర్ ఆఫీస్ పార్వతీపురం మన్యం జిల్లా
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి.
ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.