Headlines

జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగాలు భర్తీ | AP NHM Contract Basis Jobs Recruitment 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలు భర్తీ కోసం మరొక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి.

ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 25వ తేదీ లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కనుక ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది .

ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా ఏలూరు జిల్లాలో ( ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ) నందు వివిధ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

ప్రస్తుతము ఈ నోటిఫికేషన్ ద్వారా గైనకాలజిస్ట్ , మత్తు వైద్యుడు , పీడియాట్రిషన్ , జనరల్ ఫిజీషియన్ , జనరల్ సర్జన్ , కార్డియాలజిస్ట్ వంటి పోస్ట్లు భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ  , ఏలూరు  జిల్లా నుండి విడుదల చేశారు . 

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రిందన ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం , ఏలూరు జిల్లా 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : కాంట్రాక్ట్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు :  గైనకాలజిస్ట్ , మత్తు వైద్యుడు , పీడియాట్రిషన్ , జనరల్ ఫిజీషియన్ , జనరల్ సర్జన్ , కార్డియాలజిస్ట్ 

🔥 మొత్తం పోస్టులు : 12

🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు ( 01-07-2023 నాటికి ) 

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు (01-07-2023 నాటికి ) 

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ , BC అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 24-11-2023

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 25-11-2023

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా

🔥 ఫీజు : లేదు 

🔥 పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం , ఏలూరు జిల్లా 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!