Andhra Pradesh Medical Health Department Notification 2026 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్ కు చెందిన MRC ప్రాజెక్ట్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. అర్హులైన అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాలి.
తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, జీతము, అప్లికేషన్ విధానం మరియు ఇతర వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు తెలుసుకునేందుకు మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతిరోజు ఓపెన్ చేయండి.
Table of Contents :
నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
“క్యాన్సర్ అవగాహన మరియు స్క్రీనింగ్ కార్యక్రమం యొక్క మూల్యాంకనం – ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో అమలు పరిశోధన” అనే ప్రాజెక్టులో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, మెమోగ్రఫి టెక్నీషియన్, కార్డియో వాస్కులర్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, మెడికో సోషల్ వర్కర్, ఎలక్ట్రీషియన్ మరియు డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
అర్హతల వివరాలు :
పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, GNM మరియు ఇతర విద్యార్హతలు, పోస్టులు వారీగా సంబంధిత అనుభవం కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
అభ్యర్థుల ఎంపిక విధానం :
అర్హతగల అభ్యర్థులను ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
వయస్సు వివరాలు :
ఇంటర్వ్యూ తేదీ నాటికి 42 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
జీతం వివరాలు :
మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 60,000/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 38,700/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
ANM ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 29,900/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
మామోగ్రఫి టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 37,600/- జీతం చెల్లిస్తారు.
కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ గ్రా. II ఉద్యోగాలకి ఎంపికైన వారికి నెలకు 37,600/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 28,200/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 45,800/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
మెడికో సోషల్ వర్కర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 45,800/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 32,600/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
డ్రైవర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 27,500/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఉద్యోగాలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అర్హులైన అభ్యర్థులు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :
Committee Hall, Old Director Officer, Sri Venkateswara Institute of Medical
Sciences, Alipiri Road, Tirupati – 517507
ఇంటర్వ్యూ జరిగే తేదీలు :
ఇంటర్వ్యూలకు హాజరయ్య అభ్యర్థులు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్య రిపోర్టింగ్ అయ్యి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.
మెడికల్ ఆఫీసర్ మరియు మెడికల్ సోషల్ వర్కర్ ఉద్యోగాలకు ఫిబ్రవరి 19వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఫిబ్రవరి 20వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి.
స్టాఫ్ నర్స్ మరియు ANM ఉద్యోగాలకు ఫిబ్రవరి 21 మరియు 22 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి.
మామోగ్రఫీ టెక్నీషియన్లు, కార్డియోవాస్కులర్ టెక్నీషియన్లు Gr.II, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లు, ఎలక్ట్రీషియన్లు మరియు డ్రైవర్ ఉద్యోగాలకు ఫిబ్రవరి 23వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి.
ఇంటర్వ్యూకు అవసరమైన సర్టిఫికెట్స్ :
అభ్యర్థి పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, ప్రభుత్వం జారీ చేసిన ఐడి ప్రూఫ్, ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు కింది పత్రాల స్వీయ-ధృవీకరించబడిన ఫోటోస్టాట్ కాపీల సెట్‌తో హాజరు కావాలి..
1) నిర్ణీత ఫార్మాట్లో నింపిన దరఖాస్తు ఫారం.
2) ప్రభుత్వం జారీ చేసిన ఐడి ప్రూఫ్ (ఆధార్ కార్డ్ లేదా ఇతరాలు)
3) వయస్సు రుజువు – SSC సర్టిఫికేట్
4) విద్యా అర్హతల సర్టిఫికెట్లు
5) వర్తించే వారికి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
6) అనుభవ సర్టిఫికేట్లు
7) కుల ధృవీకరణ పత్రం SC / ST / BC (వర్తిస్తే)
9) ఇటీవల తీసిన రెండు పాస్‌పోర్ట్ సైజు ఛాయాచిత్రాలు, ఒకటి దరఖాస్తు ఫారమ్‌పై అతికించాలి, మరొకటి దరఖాస్తు ఫారమ్‌కు పిన్ చేయాలి.
✅ Download Full Notification – Click here
