రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులను మోసం చేసేందుకు నకిలీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13,762 పోస్టులు భర్తీ చేసేందుకు పదో తరగతి , ఇంటర్మీడియట్, డిప్లమో, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఈ నకిలీ ప్రకటన విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ (NRDRM) మిషన్ పేరిట వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ ఒక ప్రముఖ దినపత్రికలో నోటిఫికేషన్ కూడా ప్రచురించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,881 పోస్టులకు, తెలంగాణ రాష్ట్రంలో 6,881 పోస్టులకు వేరు వేరుగా నకిలీ నోటిఫికేషన్లు విడుదల చేసారు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఒక్కో అభ్యర్థి 399/- ఫీజు చెల్లించాలి అని ఈ నకిలీ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హత ఉన్న వారు ఫిబ్రవరి 5వ తేది నుండి ఫిబ్రవరి 24వ తెదిలోపు అప్లై చేయాలి అని పేర్కొన్నారు.
ఈ నకిలీ నోటిఫికేషన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీంతో చాలా మంది నిరుద్యోగులు ఇప్పటికే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్నారు.
🏹 విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అది నకిలీ నోటిఫికేషన్ – AP గ్రామీణ అభివృద్ధి శాఖ వివరణ :–

ఈ నకిలీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఫిబ్రవరి 5వ తేదిన పత్రిక ప్రకటన విడుదల చేసింది. నిరుద్యోగులు ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకొని మోసపోవద్దని తెలిపింది.
నిరుద్యోగులను ఆకర్షించి అప్లికేషన్ ఫీజు పొందడం ద్వారా నిరుద్యోగులను మోసం చేసేందుకే ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొంది. తమకున్న సమాచారం మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో అలాంటి సంస్థ గాని, విభాగం గానీ లేదు అని ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. ఇది నిరుద్యోగులకు టోకరా వేసి సంస్థని పేర్కొనడం జరిగింది.
గమనిక :
- నిరుద్యోగులు తాజాగా విడుదల చేసిన ఈ నకిలీ నోటిఫికేషన్ ఎవరికి తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేయవద్దు.
- మీ మిత్రులకి ఇది నకిలీ ప్రకటనని వెంటనే తెలియజేయండి.