ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 పోస్టులు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో పదో తరగతి అర్హతతో భర్తీ చేస్తున్న FNO అనే 30 పోస్టులు ఉన్నాయి. ఈ FNO ఉద్యోగాలకు మహిళలు మాత్రమే అర్హులు.
తాజాగా విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుంచి విడుదల చేశారు.
ఏలూరు జిల్లా DMHO కార్యాలయం నుంచి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (FNO) అనే పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత గల వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🏹 10th అర్హతతో మన రాష్ట్రంలో రైల్వే ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
- భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు DMLT లేదా B.Sc (MLT) పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయిన వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
- ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఉద్యోగాలకు కేవలం పదో తరగతి పాస్ అయిన మహిళలు అప్లై చేసుకోవచ్చు.
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జనవరి 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీలోపు అప్లికేషన్ పెట్టుకోవాలి.
- కనీసం 18 నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు… ప్రభుత్వ నిబంధనలో ప్రకారం ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, OBC అభ్యర్థులకు మూడేళ్లు, PWD అభ్యర్థులకు 10 ఏళ్ళు వయసులో సడలింపు వర్తిస్తుంది.
- ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో గతంలో పనిచేసిన వారు ఆ అనుభవం ఉన్న సర్టిఫికెట్స్ కూడా అప్లికేషన్ కి జతపరిచితే వెయిటేజీ మార్కులు ఇస్తారు.
- అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఏలూరు జిల్లాలో ఉన్న డిఎంహెచ్ఓ ఆఫీస్ లో స్వయంగా అందజేయాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు విద్యార్హతలు సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు, క్యాస్ట్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్, అనుభవం సర్టిఫికెట్స్ మరియు ఇతర సర్టిఫికెట్స్ అన్నింటి పైన సెల్ఫ్ అటిస్టేషన్ చేసి అప్లికేషన్ కు జతపరచాలి. దీంతోపాటు అప్లై చేసే అభ్యర్థులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, ఏలూరు అనే పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో 300/- రూపాయలు డిడి తీసి అప్లికేషన్ కి జతపరచాలి.
- నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలన్నీ మీరు ఒకసారి చదివిన తర్వాత ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి.
✅ Download Full Notification – Click here
✅ Official Website – Click here