డిగ్రీ అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నోటిఫికేషన్ విడుదల | Central Bank Of Zoned Based Officer Jobs | CBI Zoned Based Officer Recruitment 2025

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 కేడర్ లో జోన్ బేస్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జనవరి 21వ తేదీ నుండి ఫిబ్రవరి 9వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేసుకున్న వారికి మార్చ్ 2025 లో పరీక్ష నిర్వహిస్తారు. 

ఈ ఉద్యోగాల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదవడం ద్వారా తెలుసుకొని మీకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినవి.

🏹 AP ఫైబర్ నెట్ లిమిటెడ్ జాబ్స్ – Click here 

🏹 ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన అహ్మదాబాద్ , గౌహతి , చెన్నై, హైదరాబాద్ జోన్లలో జోన్ బేస్డ్ ఆఫీసర్స్ అనే ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 266 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో జోన్లవారీగా ఖాళీలు క్రింది విధంగా ఉన్నాయి. 
  • అహ్మదాబాద్ జోన్ – 123 పోస్టులు 
  • చెన్నై జోన్ – 58 పోస్టులు 
  • గౌహతి జోన్ – 43 పోస్టులు 
  • హైదరాబాద్ జోన్ – 42 పోస్టులు

🔥 విద్యార్హతలు

  • నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేయడానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
  • అభ్యర్థులు అప్లై చేసుకున్న జోన్ కు సంబంధించి నోటిఫికేషన్ లో ఇచ్చిన భాషల్లో ఏదో ఒక భాష వచ్చి ఉండాలి

🏹 RRB గ్రూప్ D ఉద్యోగాలు – Click here 

🔥 అనుభవం :

  • షెడ్యూల్డ్ బ్యాంక్స్ లేదా నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లో ఆఫీసర్ లేదా సూపర్వైజర్ కేడర్ లో అయితే ఒక సంవత్సరం, క్లరికల్ క్యాడర్లో అయితే మూడు సంవత్సరాలు అనుభవం ఉండాలి.

🔥 జీతం : 

  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోన్ బేస్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 48,480/- నుండి 85,920/- వరకు ఉండే పేస్కేల్ ప్రకారం జీతం ఇస్తారు.

🔥 వయస్సు : 

  • 30-12-2024 నాటికి 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 
  • SC మరియు ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం :

  • పరీక్ష , లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • అభ్యర్థులు అప్లై చేసుకున్న జోన్ కు సంబంధించి నోటిఫికేషన్ లో ఇచ్చిన భాషల్లో ఏదో ఒక భాష వచ్చి ఉండాలి.
  • పదో తరగతి లేదా 12వ తరగతి స్థాయిలో అభ్యర్థి అప్లై చేసుకున్న జోన్ లో ఉన్న స్థానిక భాషలో ఏదైనా భాష చదివినట్లయితే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉండదు.

🔥 పరీక్షా విధానం :

  • 120 ప్రశ్నలు 120 మార్కులకు ఇస్తారు. 
  • 80 నిమిషాల సమయం ఉంటుంది. 
  • ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ కేటాయిస్తారు. 
  • పరీక్షలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ మరియు ప్రస్తుత ఆర్థిక దృశ్యం & సాధారణ అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 850/- రూపాయలు + GST 
  • SC , ST / PWD అభ్యర్థులకు ఫీజు 175/- రూపాయలు + GST

🔥 అప్లై విధానము : 

  • అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై 21-01-2025 నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు 09-02-2025 తేది లోపు అప్లై చేయాలి.

🔥 పరీక్ష తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి మార్చ్ 2025 లో పరీక్ష నిర్వహిస్తారు. 

🔥 ఇంటర్వ్యూ తేదీ : 

  • పరీక్షలో షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించే తేదీని తర్వాత ప్రకటిస్తారు.

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

📌 Join Our Telegram Channel

🏹 Notification Full Details – Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!