తెలంగాణ రాష్ట్రం లోని సంగారెడ్డి యూనిట్ , డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ లో రెగ్యులర్ ప్రాధిపతికన స్టెనో/ టైపిస్ట్ మరియు రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
కేవలం 10 వ తరగతి ఉత్తీర్ణత తో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగానికి , డిగ్రీ అర్హత తో స్టేనో / టైపిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 10th అర్హతతో ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ , సంగారెడ్డి యూనిట్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం ఖాళీల సంఖ్య – 02
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- స్టెనో/ టైపిస్ట్ -01
- రికార్డు అసిస్టెంట్ -01
🔥 విద్యార్హత :
- స్టెనో/ టైపిస్ట్ :
- గుర్తింపు పొందిన సంస్థ నుండి ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లా విభాగాలలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ లో 120 ఇంగ్లీష్ పదాలను షార్ట్ హ్యాండ్ లో చేయగలగాలి.
- నిముషానికి 45 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి , గవర్మెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి గుర్తింపు పొందాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి వుండాలి.
- రికార్డు అసిస్టెంట్ :
- 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాలు నిండి యుండి , 34 సంవత్సరాల లోపు వయస్సు వున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/09/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
- ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు
- దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
- Ex – సర్విస్ మాన్ వారికి తెలంగాణ ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు లభిస్తుంది.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ను సమర్పించాలి.
- మార్క్స్ మెమోలు , పాస్ సర్టిఫికెట్లు , డేట్ ఆఫ్ బర్త్ , కాస్ట్ సర్టిఫికెట్ మొదలగునవి సెల్ఫ్ అటెస్ట్డ్ కాపీలు 2 జతలు దరఖాస్తు తో జత చేసి , 30 /- రూపాయల స్టాంప్ అతికించిన సెల్ఫ్ అడ్రసెడ్ ఎన్వలప్ తో ఆఫీస్ వారికి అందజేయాలి.
🔥 దరఖాస్తు చిరునామా:
- దరఖాస్తు ను నేరుగా ఇవ్వరాదు.
- క్రింద తెలిపిన చిరునామాకు అప్లికేషన్ ను రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా చెరవేయాలి.
- దరఖాస్తు ఎన్వలప్ పై Application for the post of ____________________ అని రాయాలి.
- CHAIRMAN , DISTRICT LEGAL SERVICES AUTHORITY , NYAYA SEVA SADAN , DISTRICT COURT PREMISES , SANGAREDDY అడ్రస్ కి పంపించాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- OC, BC అభ్యర్థులు 800/- రూపాయల అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు 400/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో The secretary , district legal services authority ,sangareddy “ payable at sangareddy పేరు మీదు గా చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
1)స్టెనో / టైపిస్ట్:
- స్టెనో / టైపిస్ట్ ఉద్యోగాలకు వ్రాత పరీక్ష , స్కిల్ టెస్ట్ , ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- వ్రాత పరీక్ష కి 40 మార్కులు , స్కిల్ టెస్ట్ కి 40 మార్కులు ,ఇంటర్వ్యూ కి 20 మార్కులు కేటాయించారు.
- వ్రాత పరీక్ష లో జనరల్ నాలెడ్జ్ 20 మార్కులు , జనరల్ ఇంగ్లిష్ 20 మార్కులు మొత్తం 40 మార్కులకు గాను 45 నిముషాలు కేటాయించారు.
2) రికార్డు అసిస్టెంట్:
- రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలకు వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- వ్రాత పరీక్ష కి 80 మార్కులు , ఇంటర్వ్యూ కి 20 మార్కులు కేటాయించారు.
- వ్రాత పరీక్ష లో 40 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ మరియు 40 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ వుంటాయి. 90 నిముషాలలో పరీక్ష పూర్తి చేయాలి.
🔥 ముఖ్యమైన అంశాలు :
- వ్రాత పరీక్ష తేది తేది 21/12/2024 ఉదయం 10:30 , డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్ సంగారెడ్డి నందు జరుగును.
🔥 ముఖ్యమైన తేదిలు:
- నోటిఫికేషన్ విడుదల తేది : 12/11/2024
- దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 13/11/2024
- దరఖాస్తు చేయడానికి చివరి తేది : 7/12/2024 ( సాయంత్రం 5:00 గంటల లోగా)
👉 Click here for notification
👉 Official Website – Click here